వేపతో రక్షణ

మిగతా వాటితో పోలిస్తే వర్షాకాలంలో ప్రత్యేక చర్మ సంరక్షణ కావాలి. చర్మం కాంతిని కోల్పోవడం, చిన్న ఇన్ఫెక్షన్లు, యాక్నే వగైరా వస్తుంటాయి. వీటికి వేప, అలోవెరాలు మంచి పరిష్కారం. వీటిలో ఎ, సి, ఇ విటమిన్లు,  యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇన్ఫెక్షన్లను దూరం చేయడంతో పాటు చర్మానికి ఆరోగ్యాన్నీ ఇస్తాయి....

Updated : 28 Aug 2021 12:45 IST

మిగతా వాటితో పోలిస్తే వర్షాకాలంలో ప్రత్యేక చర్మ సంరక్షణ కావాలి. చర్మం కాంతిని కోల్పోవడం, చిన్న ఇన్ఫెక్షన్లు, యాక్నే వగైరా వస్తుంటాయి. వీటికి వేప, అలోవెరాలు మంచి పరిష్కారం.

వీటిలో ఎ, సి, ఇ విటమిన్లు,  యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇన్ఫెక్షన్లను దూరం చేయడంతో పాటు చర్మానికి ఆరోగ్యాన్నీ ఇస్తాయి. రెండు స్పూన్ల వేపాకు మిశ్రమం, కలబంద గుజ్జు తీసుకుని కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేస్తే సరి. ఇది డీప్‌ క్లెన్సింగ్‌గా పని చేయడమే కాక ముఖంపై ఉండే ఎక్కువ నూనెల్నీ తొలగిస్తుంది. యాక్నే, ఎర్రదనం దూరమవడంతో పాటు చర్మం నునుపుగా మారడానికీ సాయపడుతుంది. బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌నీ దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్