అతిగా చేస్తున్నారేమో!

‘త్వరగా సన్నబడాలి’ అనే లక్ష్యంతో రాజీ తెగ ఎక్సర్‌సైజ్‌లు చేసేస్తోంది. పెళ్లికి ముందు సన్నజాజి తీగలా ఉండే తను బాబు పుట్టాక బాగా లావైంది. భర్త, బంధువులు నవ్వుతూ అంటున్నా.. ఆ మాటలు తనను బాధిస్తున్నాయి.

Updated : 29 Aug 2021 04:33 IST

‘త్వరగా సన్నబడాలి’ అనే లక్ష్యంతో రాజీ తెగ ఎక్సర్‌సైజ్‌లు చేసేస్తోంది. పెళ్లికి ముందు సన్నజాజి తీగలా ఉండే తను బాబు పుట్టాక బాగా లావైంది. భర్త, బంధువులు నవ్వుతూ అంటున్నా.. ఆ మాటలు తనను బాధిస్తున్నాయి. దీంతో తిండి బాగా తగ్గించి, తెగ వ్యాయామాలు చేస్తోంది. కానీ ఫలితం కనిపించట్లేదు. అది మితిమీరిన తీరుకు చిహ్నమంటున్నారు నిపుణులు..

త్వరితగతిన ఫలితం పేరిట గంటల తరబడి కసరత్తులు, తిండిని పక్కన పెట్టేయడం.. ఒత్తిడితోపాటు అలసట, వ్యాధి నిరోధకశక్తిలో తగ్గుదలకు కారణమవుతాయి. బాగా అలసిపోవడం, రోజంతా నీరసంగా ఉండటం, కీళ్ల నొప్పులు, ఎంత వ్యాయామం చేసినా ఫలితం రాకపోవడం వంటివీ ఈ ‘అతి’కి సూచనలే.

కాబట్టి.. రోజుకు 30- 45 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే చాలు. నేషనల్‌ హెల్త్‌ పోర్టల్‌ ప్రకారం.. 18-64 ఏళ్లలోపు వారెవరైనా వారానికి 150 నిమిషాలు మాత్రమే తేలిక, మధ్యస్థ వ్యాయామాలను చేయాలట. కఠినమైనవైతే అది వారానికి 75 నిమిషాలు మాత్రమే. అంతేకాదు.. శరీర బరువు, తత్వం ఆధారంగా ఏది తగినదో తెలుసుకున్నాకే ప్రారంభించాలి. అలాగే.. రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులతోపాటు విటమిన్‌ డి3, బి12, మెగ్నీషియం, ఐరన్‌లను తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం పూర్తయ్యాక స్ట్రెచింగ్‌, నీటిని బాగా తీసుకోవడం, విశ్రాంతి, బలవర్థకమైన ఆహారానికీ ప్రాధాన్యమిస్తే ఫలితం తప్పక కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్