రక్తహీనతకు చెక్‌ పెట్టేద్దాం

రోజంతా పనులతో అలసిపోయే మహిళలు సమయానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకొంటే సరిపోదు. దాని వల్ల ఆకలి తీరుతుందే కానీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. కంటి సమస్యలు మొదలు ఎనీమియా వరకూ ఎన్నింటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి...

Updated : 01 Sep 2021 05:05 IST

రోజంతా పనులతో అలసిపోయే మహిళలు సమయానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకొంటే సరిపోదు. దాని వల్ల ఆకలి తీరుతుందే కానీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. కంటి సమస్యలు మొదలు ఎనీమియా వరకూ ఎన్నింటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి...

విసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్లు, ప్రొటీన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. రోజూ చారెడు గింజలను వేయించి తినడం వల్ల ఐరన్‌ వృద్ధి చెందుతుంది. నీరసం, నిస్సత్తువ దరిచేరవు. కళ్లకు మంచిది.

బచ్చలికూరలో ఐరన్‌, విటమిన్‌ బి9, ఫైబర్‌, బీటా కెరోటిన్‌, విటమిన్‌ సి, విటమిన్‌ కె1లు, యాంటీఆక్సిడెంట్లు విస్తారం. మహిళలు బచ్చలిని ఇగురు, పప్పు లేదా పచ్చడి రూపంలో తరచూ తినడం వల్ల రక్తహీనతకు చెక్‌ పెట్టొచ్చు. అలసటను దూరం చేస్తుంది.

సోయాబీన్స్‌లో క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియంలు ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచే మంచి పోషకాహారమిది.

ఐరన్‌, విటమిన్‌ బి9, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న పెసలు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచివి. మొలకలు తినడం మరీ శ్రేష్ఠం.

పెరుగులో ఉండే విటమిన్‌ బి12, క్యాల్షియం ఎముకల పటిష్టతకు దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తినీ పెంచుతాయి. కానీ పెరుగును రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి వేసుకున్నట్లయితే పోషకాలన్నీ నశిస్తాయి.

మెంతిలో ఐరన్‌, విటమిన్‌ సి విస్తృతంగా ఉన్నందున రక్తహీనతకు పేషెంట్లను కూడా త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఇందులో పీచు కూడా అధికమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్