చినుకుల్లో చిక్కులకు...

వర్షాకాలంలో ఎదురయ్యే చిక్కులను ఎదుర్కోవడానికి వీటిని పాటించి చూడండి.. శనగపిండి, గోధుమరవ్వ, ఉప్పు వంటి చెమ్మగా అనిపించే పదార్థాలను చిన్నమంటపై వేడిచేసి, ఆరనిచ్చి, గాలి చొరబడని సీసాల్లో వేస్తే ఎక్కువ కాలం పొడిగా ఉంటాయి.

Updated : 12 Sep 2021 04:40 IST

వర్షాకాలంలో ఎదురయ్యే చిక్కులను ఎదుర్కోవడానికి వీటిని పాటించి చూడండి..

* శనగపిండి, గోధుమరవ్వ, ఉప్పు వంటి చెమ్మగా అనిపించే పదార్థాలను చిన్నమంటపై వేడిచేసి, ఆరనిచ్చి, గాలి చొరబడని సీసాల్లో వేస్తే ఎక్కువ కాలం పొడిగా ఉంటాయి.

* చెంచాడు వాములో రెండు కప్పుల నీళ్లను వేసి మరిగించి నోరు పుక్కిలిస్తే ఈ కాలంలో వచ్చే గొంతుకు సంబంధించిన సమస్యలకు దూరంకావొచ్చు.

* ప్రతిరోజు రెండు ఉసిరికాయలను తింటే, వ్యాధినిరోధక శక్తి పెరిగి, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉండదు.

* పచ్చిశనగపప్పు, కందిపప్పు, బియ్యం వంటి ఆహార పదార్థాలను భద్రపరిచే డబ్బాల్లో రెండు బిరియానీ ఆకులు, ఎండుమిర్చి వేస్తే పురుగు పట్టదు.

* వంటింటి వ్యర్థాలను వేసే డస్ట్‌బిన్‌ అడుగున వంటసోడా చల్లి మడిచిన కాగితాన్ని ఉంచితే చాలు. దుర్వాసనను అరికడుతుంది.

* రెండు చెంచాల గోధుమపిండిలో చెంచాడు బోరిక్‌ పౌడర్‌ వేసి కొంచెం నీటిని కలిపి మెత్తగా కలిపి ఉండల్లా చేసి వంటింట్లోని సామానులుంచే అలమరల మూలల్లో అతికిస్తే చాలు. బొద్దింకల బెడద తగ్గుతుంది.

* గిన్నెలు తోమే, పొయ్యి, స్టవ్‌ దిమ్మను శుభ్రం చేసే స్క్రబర్స్‌ను వారానికొకసారి లిక్విడ్‌సోప్‌ వేసిన వేడి నీటిలో అయిదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాష్‌ చేస్తే, బ్యాక్టీరియాలను నిరోధించొచ్చు.

* కప్పు నీటిలో అరచెంచాడు మిరియాలపొడి వేసి మరిగించిన కషాయంలో కొద్దిగా బెల్లం వేసి వేడివేడిగా తాగితే గొంతులో కఫం తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్