బాలింతకు జింక్‌

ప్రసవానంతరం ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే అద్భుతమైన పోషకం జింక్‌.  దీన్నుంచి ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటంటే... విత్తనాలు, ఆకుకూరలు, చిక్కుడు, బఠానీ, గుమ్మడి, ఫ్లాక్స్‌ సీడ్స్‌, పాల ఉత్పత్తులు, గుడ్లు, గింజ ధాన్యాలు, చేప, మాంసాహారం వంటి వాటిలో జింక్‌ ఎక్కువ.

Updated : 12 Sep 2021 04:39 IST

ప్రసవానంతరం ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే అద్భుతమైన పోషకం జింక్‌.  దీన్నుంచి ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...

విత్తనాలు, ఆకుకూరలు, చిక్కుడు, బఠానీ, గుమ్మడి, ఫ్లాక్స్‌ సీడ్స్‌, పాల ఉత్పత్తులు, గుడ్లు, గింజ ధాన్యాలు, చేప, మాంసాహారం వంటి వాటిలో జింక్‌ ఎక్కువ. వీటిలో పీచు, ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

వ్యాధినిరోధక శక్తి

జింక్‌ ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే ఇవి శరీరంలో టీ-కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. ఇవి వ్యాధికారక కణాలతో పోరాడి, అనారోగ్యాలను దరిచేరకుండా కాపాడతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి, సీజనల్‌ వ్యాధులకు శరీరం ప్రభావితం కాకుండా రక్షిస్తాయి. ఆయా వాతావరణాల్లో శిరోజాలకు రక్షణగా ఉంటూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ముఖంపై మచ్చలు రాకుండా అరికడుతుంది. .

చక్కెర స్థాయులు

గర్భిణిగా ఉన్నప్పుడు చక్కెరస్థాయుల్లో హెచ్చు, తగ్గులను ఇది సమన్వయం చేస్తుంది.

జీర్ణశక్తి

జింక్‌ ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత ప్రొటీన్లు అందుతాయి. అలాగే వీటిలోని పీచు జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో, పోషకాలను గ్రహించడంలో జింక్‌ ప్రధాన బాధ్యతను నిర్వర్తిస్తుంది. గర్భిణులకు జీర్ణశక్తి సమస్యలను దూరం చేస్తుంది. పాలిచ్చే తల్లులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించి, నవజాతశిశువు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఏకాగ్రత

ప్రసవానంతరం కలిగే మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి దూరం చేస్తుంది. 

సమన్వయం

శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వు వంటివాటిని సమన్వయం చేసి కావాల్సినంత మేరకే అందిస్తుంది. దీంతో అధికబరువు సమస్యకు దూరంగా ఉండొచ్చు. అలాగే రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాదు, రక్తపోటునూ.. అదుపులో ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్