పెళ్లయ్యాక బరువు పెరిగారా?

‘పెళ్లి నీళ్లు బాగా పడ్డాయ్‌!’ అమ్మాయికి పెళ్లయ్యాక కాస్త ఒళ్లు వస్తే వినపడే మాటే ఇది. వాళ్లు ఏ రకంగా అన్నా.. ఆడపిల్లలకి కాస్త చేదు మాటే. ఇందుకు మారిన ఆహార అలవాట్లతోపాటు కాస్త ఒత్తిడీ

Updated : 09 Sep 2022 12:02 IST

‘పెళ్లి నీళ్లు బాగా పడ్డాయ్‌!’ అమ్మాయికి పెళ్లయ్యాక కాస్త ఒళ్లు వస్తే వినపడే మాటే ఇది. వాళ్లు ఏ రకంగా అన్నా.. ఆడపిల్లలకి కాస్త చేదు మాటే. ఇందుకు మారిన ఆహార అలవాట్లతోపాటు కాస్త ఒత్తిడీ కారణమవుతుందట. ఈ చిట్కాలు పాటించి చూడండి.

కొత్తజంట బంధువుల ఇళ్లకీ, సరదాగా బయటికీ వెళ్లడం.. చిరుతిళ్లు మామూలే. కాదనడానికి మొహమాటం. వీటివల్ల బరువు పెరుగుతుంటుంది. ఇలాంటప్పుడు భోజన సమయంలో ఎక్కువ నీళ్లు, పండ్ల రసాలకు ప్రాధాన్యమివ్వండి. జ్యూస్‌ల్లో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉన్నవాటిని తీసుకుంటే అనవసర కొవ్వు చేరదు.

* ఉదయాన్నే అల్పాహారం ఎక్కువగా తీసుకుంటే రోజంతా చలాకీగా ఉండొచ్చనేది చాలామంది భావన. వాస్తవమే అయినా.. రాత్రి భోజనం ఎక్కువగా తీసుకుని మళ్లీ పొద్దుటా అలాగే కొనసాగిస్తే బరువు పెరగడం సాధారణమే. కాబట్టి, డిన్నర్‌ను బట్టి బ్రేక్‌ఫాస్ట్‌ని ప్లాన్‌ చేసుకోవాలి. రాత్రి ఎక్కువ ఆహారం తీసుకుంటే ఉదయం చాలా తక్కువ తినాలి.

* కొత్త ప్రదేశం, ప్రయాణాలు.. కారణమేదైనా నిద్ర తగ్గుతుంది. ఇంకోవైపు అత్తగారింట మంచి పేరు తెచ్చుకోవాలనే ఆరాటం. వెరసి తెలియని ఒత్తిడి. ఇదీ బరువును పెంచేదే! కనీసం ఏడు గంటల నిద్రను తప్పక ప్లాన్‌ చేసుకోవాలి. అవసరమైతే మధ్యాహ్నం చిన్న కునుకు వేయండి.

* కొత్తచోట వ్యాయామం అంటే ఏమనుకుంటారో అన్న కంగారు సహజమే. కాబట్టి, వీలున్నప్పుడల్లా నాలుగడుగులు వేయండి. గదిలో ఉన్నప్పుడు సైడ్‌ స్ట్రెచ్‌లు ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్