బ్రౌన్‌రైస్‌తో బరువు తగ్గొచ్చు!

రోజూ అన్నం తింటే బరువు పెరుగుతాం అంటారు కొందరు. షుగర్‌ పెరిగిపోతుందంటారు ఇంకొందరు. దీనికి పరిష్కారంగా బ్రౌన్‌ రైస్‌ తీసుకోవచ్చు.

Published : 19 Sep 2021 18:19 IST

రోజూ అన్నం తింటే బరువు పెరుగుతాం అంటారు కొందరు. షుగర్‌ పెరిగిపోతుందంటారు ఇంకొందరు. దీనికి పరిష్కారంగా బ్రౌన్‌ రైస్‌ తీసుకోవచ్చు.

బ్రౌన్‌రైస్‌లో పీచు ఎక్కువ. ఇది గుండె కవాటాలు మూసుకుపోకుండా చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళల్లో ఈ సమస్యను రానివ్వదు. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి బరువూ అదుపులో ఉంటుంది.

* ఈ బియ్యంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ స్థాయులు తక్కువ. కాబట్టి తిన్న తరవాత చాలా ఆలస్యంగా జీర్ణమవుతాయి. అలా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోజూ శరీరానికి అందడం వల్ల పెద్దపేగూ, రొమ్ము వంటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట.

* ఈ బియ్యంలో ఉండే విటమిన్లూ, ఖనిజాలతోపాటూ ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. దాని వల్ల శరీరంలో పేరుకున్న ఫ్రీ రాడికల్స్‌నీ, వ్యర్థాలనూ బయటకు పంపిస్తాయి.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వార్థక్యపు ఛాయలు  కూడా త్వరగా దరిచేరవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్