నిద్రలేమికి దూరంగా...

ఇందిర రోజంతా ఇంటిపని, ఆఫీసుపనితో అలసిపోయినా... కంటి నిండా నిద్ర రాదు. దాంతో నిద్రలేమితో బాధపడుతోంది. ఈ సమస్య ఇలానే కొనసాగితే తీవ్ర అనారోగ్యాలు దరిచేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. రోజుకి ఆరేడు గంటల నిద్ర ఆరోగ్యాన్నిస్తుందని సూచిస్తున్నారు.

Updated : 23 Sep 2021 04:37 IST

ఇందిర రోజంతా ఇంటిపని, ఆఫీసుపనితో అలసిపోయినా... కంటి నిండా నిద్ర రాదు. దాంతో నిద్రలేమితో బాధపడుతోంది. ఈ సమస్య ఇలానే కొనసాగితే తీవ్ర అనారోగ్యాలు దరిచేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. రోజుకి ఆరేడు గంటల నిద్ర ఆరోగ్యాన్నిస్తుందని సూచిస్తున్నారు. మంచి నిద్ర కోసం వారేం చిట్కాలను చెబుతున్నారో చూడండి...

* వెలుతురు తక్కువగా... పడకగదిలో బాగా వెలుతురు ఉండే లైట్లను నిద్రపోయే ముందు ఆఫ్‌ చేయాలి. ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటి గ్యాడ్జెట్ల నుంచి వెలువడే కిరణాలు కంటిని అలసిపోయేలా చేసి, నిద్రను దూరం చేస్తాయి. నిద్రను దరిచేర్చే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి ఈ వెలుతురు నిరోధకంగా మారుతుంది. అందుకే.. వీటికి దూరంగా ఉంటే మంచిది. అంతేకాదు, గదిలో లేత నీలి వర్ణం వెలుతురుండే బెడ్‌లైట్‌ మనసుకు హాయిగా అనిపిస్తుంది. అలాగే ఇష్టమైన పుస్తకాన్ని చదవడం అలవరుచుకోవాలి. చదివే పేజీలపై వెలుతురుపడేలా లైట్‌ ఉంటే కంటికి అలసట కలగదు. దీన్ని ప్రతిరోజు చిన్న వ్యాయామంగా మొదలుపెడితే, క్రమేపీ దినచర్యలో భాగమవుతుంది.

* స్నానం... రోజంతా ఇంటా, బయటా పనితో శరీరం, మనసు అలసిపోతాయి. దీన్నుంచి బయటపడాలంటే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలు. శారీరకంగానే కాకుండా, మానసికంగానూ రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఇది హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. ఆ తర్వాత చిటికెడు పసుపు కలిపిన గోరువెచ్చని పాలు లేదా వేడిగా ఛమోలీ టీ తాగితే మెదడు రిలాక్స్‌ అవుతుంది. ఒత్తిడిని దూరం చేయడానికి ప్రాణాయామం చేయడమూ మంచిదే.

* సమయం

శరీరంలోని జీవక్రియల్లో భాగమే నిద్ర కూడా. రోజూ క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో నిద్రకు ఉపక్రమిస్తే శరీరం దానికి అలవాటుపడుతుంది. దాంతో నిద్రలేమిని జయించొచ్చు. రాత్రి సమయాల్లో తేలికగా అరిగే, తక్కువ ఆహారాన్ని తీసుకుంటే, జీర్ణాశయంపై ఎక్కువ ఒత్తిడి పడదు. శరీరం త్వరగా విశ్రాంతి దశలోకి వెళుతుంది. దీంతో ఉదయం త్వరగా మెలకువరావడమే కాదు, ఆ ఉత్సాహం రోజంతా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్