కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసరాయిడ్స్‌ ఆహారంతో తగ్గించుకోవచ్చా?

నా వయసు 40. బరువు 60 కిలోలు. ఎత్తు 5.2. ఫుల్‌ బాడీ చెకప్‌ చేయించుకుంటే రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు 600 ట్రైగ్లిసరాయిడ్స్‌  ఉన్నాయన్నారు. రక్తంలో వీటి స్థాయులు సాధారణంగా ఎంత ఉండాలి? తగ్గించుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? 

Updated : 23 Sep 2021 04:49 IST

నా వయసు 40. బరువు 60 కిలోలు. ఎత్తు 5.2. ఫుల్‌ బాడీ చెకప్‌ చేయించుకుంటే రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌తో పాటు 600 ట్రైగ్లిసరాయిడ్స్‌  ఉన్నాయన్నారు. రక్తంలో వీటి స్థాయులు సాధారణంగా ఎంత ఉండాలి? తగ్గించుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? 

- ఓ సోదరి

సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు, 200 ఎంజీ/డీఎల్‌ మించకూడదు. ట్రైగ్లిసరాయిడ్స్‌ 150ఎంజీ/డీఎల్‌ మించొద్దు. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నా లేదా శరీరానికి అవసరమైన శక్తి కంటే ఎక్కువ ఆహారం తీసుకున్నా పెరుగుతాయి. తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు, ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల లేదా మధుమేహుల్లో చక్కెర నియంత్రణలో లేకపోవడం వల్ల ట్రైగ్లిజరాయిడ్స్‌ పెరిగిపోతాయి. రక్తంలో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు గుండె జబ్బులు రావొచ్చు. కాబట్టి రక్తంలో కొవ్వు నిల్వలు సాధారణ స్థాయిలో ఉంచుకోవాలి.

ఎలా తగ్గించుకోవాలి? మీరు ఐదు కిలోల వరకు బరువు తగ్గాలి. ఇందుకోసం... నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు... అంటే పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు (దంపుడు బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జలు, ఓట్స్‌, పొట్టుతో ఉన్న గోధుమ పిండి) వాడాలి. ఇవి మూడు పూటలకూ కలిపి 270 గ్రా. మించ కూడదు. రోజుకు 40 గ్రా. పీచు తీసుకోవాలి. 

ఆకు కూరలు (100 గ్రా.), కూరగాయలు (200 గ్రా.) ఉండేలా చూసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే జామ, పైనాపిల్‌, పిండి పదార్థం శాతం తక్కువగా ఉండే తర్బూజ, బత్తాయి, నారింజ, నేరేడు, దానిమ్మ, పచ్చి అంజీరాలను తీసుకోవాలి. ఎండు ఖర్జూరాలు, ఎండు ఫలాలు బాగా తగ్గించాలి. చక్కెరలు ఉండే సపోటా, ద్రాక్ష, అరటిపండ్లను మోతాదులో తీసుకోవాలి. నూనెలు... రోజుకు 4- 6 చెంచాలు (దాదాపు 27 ఎం.ఎల్‌.) వాడుకోవచ్చు. నువ్వులు, సోయా, ఆవ, సెనగ నూనెలు వాడొచ్చు. ఎక్కువ సేపు వేయించిన పదార్థాలు శరీరానికి హానికరం. చక్కెర, బెల్లం, తేనె ఏదైనా రోజుకు రెండు చెంచాలే వాడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్