కురులకు నూనెలు...

జట్టు రాలడాన్ని అడ్డుకోవాలంటే సహజసిద్ధమైన నూనెలను వాడాలి. వీటిని ఇంట్లోనే తేలిగ్గా చేసుకోవచ్చు. ఎలానో చూడండి...

Published : 24 Sep 2021 01:02 IST

జట్టు రాలడాన్ని అడ్డుకోవాలంటే సహజసిద్ధమైన నూనెలను వాడాలి. వీటిని ఇంట్లోనే తేలిగ్గా చేసుకోవచ్చు. ఎలానో చూడండి...

* హెర్బల్‌.. తులసి, వేపాకులు, నానబెట్టిన మెంతులను  గుప్పెడు చొప్పున తీసుకుని మిక్సీలో ముద్దలా చేయాలి. దీనికి కప్పు కొబ్బరినూనె కలిపి ఈ మిశ్రమాన్ని పొయ్యిపై ఉంచి చిక్కగా అయ్యేవరకు మరగనిచ్చి చల్లార్చుకోవాలి. వారానికొకసారి ఈ నూనెతో మర్దనా చేసి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ నూనెలోని యాంటీ బాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

* నిమ్మ... నిమ్మ తొక్కలను ముద్దలా చేయాలి. దీనికి సమానంగా ఆలివ్‌నూనె కలిపి కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. చిక్కబడిన ఈ నూనెతో మర్దన చేసుకుంటే చుండ్రు తగ్గి జుట్టుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

* నల్ల జీలకర్ర... అయిదుకప్పుల నీటిలో కప్పు నల్ల జీలకర్ర వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమానికి చెంచా ఆలివ్‌ నూనెను కలిపి భద్రపరచాలి. ఇందులోని వ్యాధి నిరోధక గుణాలు మాడును ఆరోగ్యంగా ఉంచి, జుట్టు పెరగడానికి దోహదపడతాయి.

* పుదీనా... గుప్పెడు పుదీనా ఆకులను మెత్తగా చేసి సీసాలో వేయాలి. ఇందులో కప్పు బాదం నూనె వేసి మూడు రోజులు ఎండలో ఉంచి భద్రపరుచుకోవాలి. దీంతో వారానికి రెండుసార్లు మర్దన చేస్తే చుండ్రు దూరమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్