చిన్నారులకివి పెట్టొద్దు!

చాలా మంది చిన్నారులు, చక్కెరలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం అంటే ఎక్కువ ఇష్టం చూపిస్తారు. అయితే వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. మరి ఆ పదార్థాలేంటో... వాటికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చూద్దామా..

Updated : 26 Sep 2021 05:42 IST

చాలా మంది చిన్నారులు, చక్కెరలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం అంటే ఎక్కువ ఇష్టం చూపిస్తారు. అయితే వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. మరి ఆ పదార్థాలేంటో... వాటికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చూద్దామా..

ఫ్రైస్‌... ప్రాసెస్డ్‌ ఫుడ్‌... ఈ ఆహార పదార్థాల్లో కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని పిల్లలు తరచూ తినడం వల్ల ఊబకాయులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇందుకు బదులుగా రోస్ట్‌ చేసిన, ఉడికించిన పదార్థాలు పెడితే మంచిది.

క్యాండీలు... ఫ్రూట్‌ గమ్స్‌... వీటిలో చక్కెరలు, కెలొరీలు మెండుగా, పోషకాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యానికి హానికరమే కానీ... ప్రయోజనం లేదు. వీటికి బదులుగా తాజా పండ్లను చిన్నారుల ఆహారంలో చేర్చాలి.

చిప్స్‌... వీటిలో అధిక మొత్తంలో కెలొరీలు, ఉప్పు, అనారోగ్యకర కొవ్వులు దండిగా ఉంటాయి. ఈసారి మీ చిన్నారి చిప్స్‌ కావాలంటే వాటికి బదులుగా ఉడికించిన చిలగడ దుంపను ఇవ్వండి. లేదా ఇంట్లో తయారుచేసిన పాప్‌కార్న్‌ ఐనా సరే.

పండ్లరసాలు.. శీతల పానీయాలు.. ప్యాక్డ్‌ ఫ్రూట్‌ జ్యూస్‌ల్లో చక్కెరల మోతాదు చాలా ఎక్కువే. వీటిని తరచూ తాగితే క్యావిటీ ప్రమాదం ఉంది. వీటికి బదులుగా తాజా పండ్ల రసం, కొబ్బరినీళ్లు అలవాటు చేయడం మంచిది.

చాక్లెట్‌...   వీటిలో బోలెడు రకాలుంటాయి. అయితే మిల్క్‌ చాక్లెట్‌లో బోలెడంత చక్కెరలుంటాయి. వీటికి చిన్నారులను దూరంగా ఉంచడమే కాకుండా వాటి స్థానంలో డార్క్‌ చాక్లెట్‌లను అలవాటు చేస్తే సరి.

కెచప్‌... వీటిలో ఎక్కువ మోతాదులో ప్రాసెస్‌ చేసిన, అలాగే ప్రిజర్వేటివ్స్‌ ఎక్కువగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్