మళ్లీ వేడి చేస్తున్నారా?

వండుకునే తీరిక లేక కొందరు, బయట తినడానికి అలవాటు పడి మరికొందరు, వృథా ఎందుకులే అని ఇంకొందరు... మిగిలిన పదార్థాలను వేడి చేసి తింటుంటారు. కొన్నింటిని పదేపదే వేడి చేస్తే ప్రమాదం ఎందుకంటే..

Published : 27 Sep 2021 00:35 IST

వండుకునే తీరిక లేక కొందరు, బయట తినడానికి అలవాటు పడి మరికొందరు, వృథా ఎందుకులే అని ఇంకొందరు... మిగిలిన పదార్థాలను వేడి చేసి తింటుంటారు. కొన్నింటిని పదేపదే వేడి చేస్తే ప్రమాదం ఎందుకంటే..

* మాంసకృత్తులు అధికంగా దొరికే పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. నిల్వ ఉంచడం, రీహీట్‌ చేయడం రెండూ సరికాదు. ఇలా చేస్తే వీటిల్లోని ప్రొటీన్లు విచ్ఛిన్నమై జీర్ణసంబంధిత సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చు.

* ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. అన్నాన్ని మళ్లీ వేడి చేస్తే అందులోని బ్యాక్టీరియా టాక్సిన్లను విడుదల చేస్తుంది.

* చికెన్‌ని రెండోసారి ఉడికిస్తే అందులో మాంసకృత్తులు నశిస్తాయి. అదే గుడ్ల విషయంలో అయితే క్యాన్సర్‌ కారక ఫ్రీరాడికల్స్‌ విడుదల అవుతాయి.

* ఆకుకూరలు, క్యారెట్‌లను అతిగా ఉడికించడం, రెండోసారి వేడి చేయడం వల్ల వీటిల్లోని ఇనుము, నైట్రేట్లు... పోషకాలు హానికరంగా మారిపోతాయి. కార్సినోజెనిక్‌ ప్రాపర్టీలు విడుదలై క్యాన్సర్‌కి కారణమ వుతాయి. బంగాళాదుంపను మరో సారి వేడిచేస్తే పోషక విలువలు నశించడంతో పాటు శరీరంలోకి టాక్సిన్లు చేరతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్