అమ్మ అవ్వాలనుకుంటే.. తినాలివి

మాతృత్వం కోరుకోని అమ్మాయుండదు. కానీ దీనికి ముందుగా శరీరాన్ని సిద్ధం చేయాలంటున్నారు నిపుణులు. అందుకు ఏమేం చేయాలో సూచిస్తున్నారు. ఆహారంలో ఫోలిక్‌ యాసిడ్‌, మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగే మాంసం తక్కువగా, కూరగాయలను అధికంగా తీసుకోవాలి.

Published : 28 Sep 2021 01:14 IST

మాతృత్వం కోరుకోని అమ్మాయుండదు. కానీ దీనికి ముందుగా శరీరాన్ని సిద్ధం చేయాలంటున్నారు నిపుణులు. అందుకు ఏమేం చేయాలో సూచిస్తున్నారు.

హారంలో ఫోలిక్‌ యాసిడ్‌, మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగే మాంసం తక్కువగా, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. రోజూ ఒకదానికే కాకుండా భిన్న కూరగాయల్ని ఆహారంగా తీసుకోండి. వీటిల్లోని విటమిన్లు, మినరల్స్‌ శరీరంలో ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే పాల పదార్థాలతోపాటు ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండేవాటినీ తినాలి.

రోజూ గుప్పెడు నట్స్‌ను తప్పక తీసుకోవాలి. వీటిలోని పోషకాలు అండం నాణ్యతను పెంచడంతోపాటు గర్భం నిలవడంలోనూ సాయపడతాయి. ఓట్స్‌, క్వినోవా, బ్రౌన్‌ రైస్‌, బ్రౌన్‌ బ్రెడ్‌ వంటివి రోజూ తీసుకుంటే హార్మోన్లను క్రమబద్ధం చేస్తాయి.

వంటలో ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌ను వాడండి. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ  గర్భధారణ హార్మోన్‌ అభివృద్ధితో పాటు గర్భాశయానికి రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి.

వారానికి అయిదు రోజులపాటు కనీసం గంటపాటు మధ్యస్థ తీవ్రత ఉన్న వ్యాయామాలను చేయాలి. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్