డైటింగ్‌లో జాగ్రత్తలు ...

రాగిణి స్నేహితురాలిని చూసి తనూ అలాగే నాజూగ్గా మారాలనే ప్రయత్నం మొదలు పెట్టింది. కాలేజీలో తానే జీరోసైజు కావాలని పూర్తిగా తినడం మానేసింది...

Updated : 01 Oct 2021 12:37 IST

రాగిణి స్నేహితురాలిని చూసి తనూ అలాగే నాజూగ్గా మారాలనే ప్రయత్నం మొదలు పెట్టింది. కాలేజీలో తానే జీరోసైజు కావాలని పూర్తిగా తినడం మానేసింది. దీంతో బలహీనత మొదలైంది. చదువుపైనా శ్రద్ధ తగ్గింది. అందుకే డైటింగ్‌ శరీర జీవక్రియలపై చెడు ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలంటున్నారు వైద్య నిపుణులు. లేదంటే తీవ్ర అనారోగ్యాల ముప్పుందని హెచ్చరిస్తున్నారు. డైటింగ్‌ చేసేటప్పుడు పాటించకూడని, పాటించాల్సిన కొన్ని అంశాలను సూచిస్తున్నారు.

అతి తక్కువ... అకస్మాత్తుగా కెలోరీలు అతి తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు క్షీణిస్తుంది. ఇలా బరువు తగ్గడానికి కెలోరీలను కరిగించుకోవడానికి ప్రయత్నిస్తే అది పూర్తిగా శక్తిహీనంగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే ఆహారంలో మార్పులు క్రమబద్ధంగా ఉండాలి.

కండరాలు డైటింగ్‌ చేస్తున్నామని వ్యాయామాన్ని వదిలేస్తే ఫలితం ఉండదు. నిత్యం ఓ అరగంటైనా వర్కౌట్లు, వాకింగ్‌, మెట్లు ఎక్కిదిగడం వంటివన్నీ చేస్తే కెలోరీలను కరిగిస్తాయి. కండరాలు, ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.

తీపి చక్కెర, శీతల పానీయాలు, పండ్లరసాలు వంటివి కెలోరీలను పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయులను అధికం చేస్తాయి. బరువు తగ్గాలంటే వీటికి దూరంగా ఉండటం మంచిది. బదులుగా తాజా పండ్ల ముక్కలు తీసుకోవచ్చు.

ప్రొటీన్లు శరీరానికి కావాల్సినంత మాత్రమే ప్రొటీన్లుండే ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే బరువును నియంత్రించొచ్చు. అలాగే నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. రోజుకి కనీసం ఆరేడుగంటల నిద్ర జీవక్రియలను సమన్వయం చేస్తుంది.

అల్పాహారం అల్పాహారాన్ని మానకూడదు.  కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని వీలైనంత తగ్గించి, తేలికగా జీర్ణమయ్యే, ప్రొటీన్‌ ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ ఆరేడు గ్లాసుల నీటిని తాగడంవల్ల శరీరం డీహైడ్రేట్‌ కాకుండా, శక్తిని కోల్పోకుండా ఉంటుంది.

ప్రతి రెండు గంటలకు పూర్తిగా తిండి మానేయకుండా, ప్రతి రెండు గంటలకు ఒకసారి తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే జీవక్రియల శాతం పూర్తిగా పడిపోయి, అనారోగ్యాలు చుట్టుముడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్