తిండంటే అనాసక్తా?
చిన్నారుల్లో ఆహారంపై అనాసక్తిగా ఉండటం లేదా ప్లేటులోని భోజనాన్ని చిందరవందరగా చేయడం వంటి లక్షణాలకు కారణాలను కనుగొంది సౌత్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల
చిన్నారుల్లో ఆహారంపై అనాసక్తిగా ఉండటం లేదా ప్లేటులోని భోజనాన్ని చిందరవందరగా చేయడం వంటి లక్షణాలకు కారణాలను కనుగొంది సౌత్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం. వీరు జరిపిన ఓ అధ్యయన నివేదిక ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ అండ్ హెల్త్’లో ప్రచురితమయ్యింది. పదేళ్లలోపు పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడానికి కారణాలపై ఈ అధ్యయనం చేశారు. ఇష్టంలేని వంటలు, ఒంటరిగా తినాల్సి రావడం, నిత్యం ఒకే రకమైన పదార్థాలు.. వీటన్నింటి వల్లా పిల్లలకు తిండిపై శ్రద్ధ తగ్గుతుంది. వీరిలో ఆకలిని పెంచి, పౌష్టికాహారాన్ని తీసుకునేలా తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని నియమాలను శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అందరితో కలిసి
ఇంట్లో ముందుగానే చిన్నారులకు భోజనం అందించకుండా, కుటుంబంతో కలిసి తినేలా చేయాలి. అందరితో కలిసి ఉన్నప్పుడు ఎదుటి వారి నుంచి పిల్లలు కూడా ఎటువంటి ఆహారం, దాన్ని ఎలా తినాలో నేర్చుకుంటారు. తోబుట్టువులతో కలిసి తింటే మరీ మంచిది. పలురకాల కూరగాయలతో చేసిన ఆహారంపై అవగాహన పెంచుకుంటారు. అంతేకాదు, రోజూ ఒకేలాంటి పదార్థాలు కాకుండా రకరకాల, రంగురంగుల కూరగాయలతో చేసే ఆహార పదార్థాలను అందించడం కూడా చిన్నారుల్లో తినాలన్న ఆసక్తిని పెంచుతుంది.
నిర్ణీత సమయం
రోజులో నిర్ణీత సమయంలో కనీసం అయిదు సార్లు ఆహారం తీసుకోవడం చిన్నప్పటి నుంచి నేర్పాలి. మధ్యలో తీపిపదార్థాలు, చిరు తిండి అలవరిస్తే ఆ ప్రభావం ఆహారంపై పడుతుంది. దాంతో చిన్నారులు అసలైన భోజనంపై ఆసక్తి చూపించరు.
సానుకూలం
ఇంటిల్లపాదీ కలిసి భోజనం చేసేటప్పుడు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి. వాదోప వాదాలు, చర్చలు లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే ఇవన్నీ పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. అది వారిలో ఒత్తిడిని కలిగించి, ఉండే కొంచెం ఆకలిని కూడా దూరం చేస్తుంది. కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు టీవీ లేదా ఎవరికి వారు ఫోన్లో బిజీగా ఉండకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!