చన్నీటి స్నానం... ఎంతో ప్రయోజనం

రమాదేవికి వేడివేడి నీళ్లుంటేనే హాయిగా స్నానం చేయాలనిపిస్తుంది. ఆ తర్వాత పట్టే చెమటకు చికాకు అనిపించినా, చన్నీటి స్నానానికి మాత్రం ధైర్యం చేయదు. వైద్యనిపుణులు మాత్రం చన్నీళ్లతో స్నానం

Updated : 06 Oct 2021 03:50 IST

రమాదేవికి వేడివేడి నీళ్లుంటేనే హాయిగా స్నానం చేయాలనిపిస్తుంది. ఆ తర్వాత పట్టే చెమటకు చికాకు అనిపించినా, చన్నీటి స్నానానికి మాత్రం ధైర్యం చేయదు. వైద్యనిపుణులు మాత్రం చన్నీళ్లతో స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచే ఈ స్నానం అందించే మరిన్ని లాభాలను తెలుసుకుందాం.

* స్పందన కలిగించి...

రక్తనాళాలను స్పందించేలా చేసే చన్నీటి స్నానం శరీరానికి మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ స్పందనతో గుండెకు రక్తసరఫరా చేసే నాళాల్లో పేరుకుపోయే కొవ్వు నిల్వల శాతం తగ్గుముఖం పడుతుందంటున్నారు నిపుణులు. మానసికంగానూ చాలా రకాల ప్రయోజనాలున్నాయి. చన్నీటి స్నానం అలవాటున్నవారు అనారోగ్యాలకి దూరంగా ఉన్నట్లు ఎన్నో అధ్యయనాల్లో తేలింది.

* సమన్వయం..

మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులను ఈ స్నానం మెరుగుపరుస్తుంది. చన్నీటి స్నానంతో శరీరంలో డోపమైన్‌, సెరటోనిన్‌ స్థాయులు పెరిగినట్లు పలు అధ్యయనాలు కూడా తేల్చాయి. చన్నీళ్లను ఒంటిపై వేసుకున్న వెంటనే రక్తనాళాలు శరీరాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి, వెచ్చగా మార్చడానికి ప్రయత్నిస్తాయి. ఇలా చేయడంతో శరీరం అదనపు శక్తిని పొందడమే కాదు, జీవక్రియలన్నీ సమన్వయమవడానికి తోడ్పడతాయి. 

* వ్యాధినిరోధక శక్తి

నెదర్లాండ్స్‌లో జరిపిన ఓ అధ్యయనం చన్నీటి స్నానం వ్యాధినిరోధక శక్తిని పెంచి, అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడుతుందని తేల్చి చెప్పింది. అలాగే ఒత్తిడిని దూరం చేసే హార్మోన్లను విడుదలయ్యేలా చేసి మనసు ఉల్లాసంగా మారుస్తుందని మెడికల్‌ హైపోథీసిస్‌ జర్నల్‌లో ప్రచురించారు. అయితే ఎక్కువ సమయం చన్నీళ్లలో ఉండకుండా అయిదు నుంచి పది నిమిషాల్లో స్నానాన్ని ముగిస్తే శారీరక, మానసికారోగ్యాలు మెరుగ్గా ఉంటాయంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్