ఇలా చేస్తే అధికబరువు దూరం...
పాతికేళ్ల అమల సన్నబడటానికి వ్యాయామాలు చేస్తున్నా... బరువు తగ్గడంలేదు. దీంతో నిరాశకు గురవుతోంది. 20 నుంచి 55 ఏళ్లలోపు వారు ఎత్తుకు తగిన బరువుండేలా జాగ్రత్తపడితే వృద్ధాప్యంలో అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు నిపుణులు
పాతికేళ్ల అమల సన్నబడటానికి వ్యాయామాలు చేస్తున్నా... బరువు తగ్గడంలేదు. దీంతో నిరాశకు గురవుతోంది. 20 నుంచి 55 ఏళ్లలోపు వారు ఎత్తుకు తగిన బరువుండేలా జాగ్రత్తపడితే వృద్ధాప్యంలో అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు నిపుణులు. రోజూ తీసుకునే ఆహారంద్వారా అధికంగా చేరే 100-200 కెలోరీలే క్రమేపీ బరువును పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.
* తక్కువగా...
రోజూ ఆహారంలో కనీసం 100 నుంచి 200 కెలోరీలను తగ్గించడానికి ప్రయత్నించాలి. అలాగే 200 కెలోరీలు కరిగేలా వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే బరువు సమన్వయమవుతుంది. అంటే .. తగ్గడం మాట అటుంచి పెరగకుండా ఉంటారు. అమెరికాకు చెందిన ఓ నిపుణుల బృందం అధికబరువుపై 3000 మందిపై చేసిన అధ్యయనం తర్వాత ఈ విధానాలను సూచించింది.
* చిన్నగా...
ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు కాస్త ముందుగా బయలుదేరి ఇంటినుంచి బస్టాండుకు నడిచి వెళ్లడం లేదా ఒక స్టాపు ఉందనగానే దిగి, అక్కడి నుంచి ఆఫీస్‌కు నడవడం వంటివి శరీరానికి వ్యాయామంలా పనిచేస్తాయి. ప్రతి చిన్న పనికి బైక్, కారును వినియోగించకుండా నడిచి వెళితే కొన్ని కెలోరీలనైనా తగ్గించుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్ చిప్స్వంటివాటికి బదులు తాజా కూరగాయలు, పండ్ల సలాడ్లు తీసుకుంటే కెలోరీలు పెరిగే ప్రమాదం ఉండదు. రోజుకి ఆరేడుగ్లాసుల నీటిని తాగాలి.
* వంటలో...
ఏ వంటకైనా నూనె తక్కువగా వాడాలి. వేపుళ్లు, పూరీ, దోసె వంటివాటికి దూరంగా ఉండాలి. కూరగాయలను ఆవిరిపై ఉడికించుకోవాలి. స్వీట్లు తినే అలవాటును తగ్గించుకోవాలి. పెంపుడు జంతువును వాకింగ్‌కు తీసుకెళ్తే మీకూ వ్యాయామం.
* నడక... ఆహారాన్ని తీసుకునే ప్లేటు చిన్నగా ఉండాలి. భోజనానికి ముందు పీచు ఉండే తాజా కాయగూరల సలాడ్లు తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఎక్కువ భోజనాన్ని తినలేం. కెలోరీలు పెరగవు. ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడటం, టీవీ చూడటం వంటివాటికి దూరంగా ఉంటే మంచిది. ఏకాగ్రతగా ఆహారాన్ని నమిలి మింగడంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అధిక కొవ్వు పేరుకునే ప్రమాదం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- విజయానికి అందం అడ్డయ్యింది!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
- పసిడి మెరుపులు... పంచలోహ పట్టీలు!
ఆరోగ్యమస్తు
- ఎలక్ట్రోలైట్స్... తాగుతున్నారా?
- భవిష్యత్తుపై బెంగతో నిద్రపోవట్లేదట...
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- Mangoes: అందుకే తినేముందు నీళ్లలో నానబెట్టాలి!
- ఆరుబయట ఆడుతున్నారా..!
అనుబంధం
- రంగులు తెలిసేలా!
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
యూత్ కార్నర్
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
- ఆ సమయంలో... అయిదేళ్ల పిల్లనైపోతా!
- కేరళ కుట్టికి... ‘టీన్’ కిరీటం!
'స్వీట్' హోం
- తేలిగ్గా వండేద్దాం..!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
- ఎయిర్ ప్యూరిఫయర్‌కు బదులు ఇవి!
- వంటింట్లో కీటకాల బెడదా..
వర్క్ & లైఫ్
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!
- గెలవాలంటే నేర్చుకోవాలి..
- మళ్లీ పెళ్లి వద్దంటోంది..!
- ప్రతిసారీ మర్చిపోతున్నారా?