బరువు తగ్గించే దాండియా

దసరా సరదాలనూ వెంటపెట్టుకుని వచ్చేసింది. ప్రాంతమేదైనా... దాండియా, గర్భా, కోలాటం, బతుకమ్మ.... అంటూ ఆటలాడుతున్నారు మహిళలు. పాటల సవ్వడికి అనుగుణంగా అడుగులు కలుపుతూ చేసే ఈ నృత్యం ఆరోగ్యానికి ...

Published : 11 Oct 2021 01:44 IST

దసరా సరదాలనూ వెంటపెట్టుకుని వచ్చేసింది. ప్రాంతమేదైనా... దాండియా, గర్భా, కోలాటం, బతుకమ్మ.... అంటూ ఆటలాడుతున్నారు మహిళలు. పాటల సవ్వడికి అనుగుణంగా అడుగులు కలుపుతూ చేసే ఈ నృత్యం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు. అదెలాగంటే...

* దసరా ఆటలు ఏరోబిక్స్‌, కార్డియో వర్కవుట్‌ల్లాగా శరీరం మొత్తానికి వ్యాయామ ఫలితం అందిస్తాయి. 

* ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. శరీరానికి శ్రమని కలిగిస్తాయి. అప్పుడు  ఒంట్లో విడుదలయ్యే ఎండార్ఫిన్‌లనే రసాయనాలు మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాదు నలుగురిలోనూ కలిసి ఆడటం వల్ల బిడియం పోయి చొరవ, ఆత్మవిశ్వాసం అలవడతాయి.

* ఈ తొమ్మిది రోజులూ క్రమం తప్పకుండా బతుకమ్మ, కోలాటం, దాండియా వంటి ఆటలు ఆడితే బరువు కూడా సులువుగా తగ్గొచ్చు. కండరాలు స్ట్రెచ్‌ అవుతాయి కాబట్టి శరీరమూ సౌకర్యంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్