కొలెస్ట్రాల్‌కు దూరంగా..

హిమజకు 40 ఏళ్లు. ఈ మధ్య తరచూ తీవ్ర నిస్సత్తువకు గురవుతోంది. చిన్న సమస్య వచ్చినా పరిష్కరించడంలో ఒత్తిడి, ఆందోళనకు లోనవుతోంది. ఇల్లు, పిల్లల బాధ్యతలను సమన్వయం చేసుకోలేకపోతోంది. కొలెస్ట్రాల్‌లో హెచ్చు తగ్గులే ఈ సమస్యలకు కారణమంటున్నారు వైద్యనిపుణులు.

Updated : 12 Oct 2021 04:59 IST

హిమజకు 40 ఏళ్లు. ఈ మధ్య తరచూ తీవ్ర నిస్సత్తువకు గురవుతోంది. చిన్న సమస్య వచ్చినా పరిష్కరించడంలో ఒత్తిడి, ఆందోళనకు లోనవుతోంది. ఇల్లు, పిల్లల బాధ్యతలను సమన్వయం చేసుకోలేకపోతోంది. కొలెస్ట్రాల్‌లో హెచ్చు తగ్గులే ఈ సమస్యలకు కారణమంటున్నారు వైద్యనిపుణులు. అందుకు పరిష్కారాలూ చెబుతున్నారు...

ధనియాలు... యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్‌ యాసిడ్‌, ఎ, సి విటమిన్లు, బీటా కెరొటిన్‌ వంటివి ధనియాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. రోజూ చెంచా ధనియాలను కప్పు నీటిలో మరగనిచ్చి వడకట్టి గోరువెచ్చగా తాగితే అదుపులో ఉంటుంది.

ఓట్స్‌... రోజూ కప్పు ఓట్స్‌ తిని చూడండి. ఇందులోని పీచు ఒంట్లోని అధిక కొవ్వుని తగ్గిస్తుంది. బీన్స్‌, నారింజ వంటివీ కొవ్వు స్థాయుల్ని పెరగనివ్వవు. అలాగే పొట్టు తీయని ధాన్యం, పప్పుదినుసులను ఎంచుకుంటే పోషకాలు, పీచు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటూ తగ్గుతుంది.

ఇవి కూడా.. పసుపు... రక్తనాళాల్లో పేరుకునే కొవ్వును కరిగిస్తుంది. అలానే రోజూ తాజా కూరగాయలు, పండ్ల సలాడ్లు తీసుకోవాలి. తక్కువ నూనెతో వంటకాలు చేయడమూ అలవరుచుకోవాలి. అప్పుడే సమస్య దూరమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్