తీరొక్క పూలు.. ఆరోగ్యానికి మేలు!

బతుకమ్మ.. మహిళాశక్తిని ప్రతిబింబించే గౌరీదేవి ప్రతిరూపం. ఈమెను వివిధ రకాల పేర్చిన పూల రూపంలో కొలుస్తాం. ఆ పూలన్నీ ఈ కాలంలో దొరికేవే. వీటిని ఉపయోగించడం వెనక ఆరోగ్య సూత్రాలూ ఉన్నాయన్న విషయం తెలుసా?పసుపు రంగులో ఉండే ఈ పూలే కాదు.. మొక్కలోని ప్రతి భాగమూ ఔషధ గుణాలున్నదే. వీటిని మధుమేహం, అల్సర్‌, మలబద్ధక నివారణకే కాకుండా సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు....

Published : 13 Oct 2021 01:21 IST

బతుకమ్మ.. మహిళాశక్తిని ప్రతిబింబించే గౌరీదేవి ప్రతిరూపం. ఈమెను వివిధ రకాల పేర్చిన పూల రూపంలో కొలుస్తాం. ఆ పూలన్నీ ఈ కాలంలో దొరికేవే. వీటిని ఉపయోగించడం వెనక ఆరోగ్య సూత్రాలూ ఉన్నాయన్న విషయం తెలుసా?

తంగేడు: పసుపు రంగులో ఉండే ఈ పూలే కాదు.. మొక్కలోని ప్రతి భాగమూ ఔషధ గుణాలున్నదే. వీటిని మధుమేహం, అల్సర్‌, మలబద్ధక నివారణకే కాకుండా సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు.

బంతి: పండుగ, పూజ ఏదైనా ఈ పూలకే ప్రాధాన్యం. దీనిలో విటమిన్‌ సి, ఫ్లావనాయిడ్‌ గుణాలుంటాయి.

గునుగు: దీన్ని ప్రపంచవ్యాప్తంగా అలంకరణ కోసం ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ డయాబెటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలెక్కువ. దెబ్బలు, కాలిన గాయాలు, కడుపునొప్పి మొదలైనవాటికి మంచి మందు.

మందార: పువ్వే కాదు.. ఆకులు, కాండాల్లోనూ బోలెడు ఔషధ గుణాలు. విటమిన్‌ సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.

గులాబీ: ఎండిన పూరేకలను తలనొప్పి చికిత్సకు ఉపయోగిస్తారు. రోజ్‌వాటర్‌ ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది. చర్మం కింద వాపు వంటివాటినీ అరికడుతుంది.

నందివర్దనం: రక్తపోటు నివారణ మందుల్లో వాడతారు. ఇంకా గాయాలు, కార్డియోవాస్క్యులర్‌, యాంటీ ట్యూమర్‌, యాంటీ ఇన్ఫెక్షన్‌, యాంటీ ఆక్సిడేటివ్‌ ఔషధాల్లోనూ వినియోగిస్తారు.

తామర: మెడిసినల్‌ గుణాలెక్కువ. పురాతన కాలం నుంచీ ఎన్నో వ్యాధుల నివారణకు దీన్ని ఉపయోగిస్తున్నారు. దగ్గు, క్యాన్సర్‌, జ్వరం, నెలసరి సమస్యలు, మొటిమలు, కొలెస్టరాల్‌, మూత్రపిండ సంబంధ వ్యాధులు, మధుమేహం మొదలైన వాటి నివారణ మందుల తయారీలో ఇది తప్పనిసరి.

చామంతి: దీనిలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, క్యాల్షియం, ఐరన్‌, సోడియం వంటి మినరల్స్‌ ఉంటాయి. వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే.

ఇలా.. ప్రతి పువ్వూ ఓ ఔషధ గనే! మగవాళ్లు పూలను తెస్తే.. ఆడవాళ్లు పూజ చేసి, దగ్గర్లోని బావి, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయటం సంప్రదాయం. అలా నీటిలోని సూక్ష్మజీవులే నశించడమే కాదు.. వాటిని తాగినవారికీ ఆరోగ్యం సహజసిద్ధంగా లభిస్తుందన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్