గర్భస్థ శిశువు ఆరోగ్యానికి సగ్గుబియ్యం!

సగ్గుబియ్యంతో స్వీట్లు, అల్పాహారం... ఇలా ఏది వండినా రుచిగా ఉంటాయి. శరీరానికి పోషకాలూ అందుతాయి.

Updated : 15 Oct 2021 05:38 IST

సగ్గుబియ్యంతో స్వీట్లు, అల్పాహారం... ఇలా ఏది వండినా రుచిగా ఉంటాయి. శరీరానికి పోషకాలూ అందుతాయి.

హిళల్లో, శాకాహారం తీసుకునే వారిలో పోషకాల లేమి ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని అధిగమించడానికి రోజూ కాస్త సగ్గుబియ్యం జావ తాగండి. దీన్నుంచి లభించే ప్రొటీన్‌ కండరాలను బలంగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్‌లు శరీరాన్నీ చురుగ్గా ఉంచుతాయి. అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలూ అదుపులో ఉంటాయి.

* కొందరు చాలా సన్నగా ఉన్నామని బాధ పడిపోతుంటారు. ఇలాంటివారు సగ్గుబియ్యాన్ని ఆహారంలో చేర్చుకుంటే సులువుగా బరువు పెరుగుతారు. సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి గర్భస్థ శిశువుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులూ తగ్గుతాయి.

* వీటిల్లో లభించే క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌ కె వంటివి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా మెనోపాజ్‌ దశలో మహిళల్ని వేధించే ఆస్టియోపోరోసిస్‌కి అడ్డుకట్ట వేయొచ్చు. అధికరక్తపోటు అదుపులో ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్