ప్రసవ ఇబ్బందుల్ని తీర్చే మునగ

ప్రొటీన్లూ, విటమిన్‌లూ...ఇతర పోషకాలు ఖరీదైన ఆహారంలో మాత్రమే ఉంటాయనుకోవడం పొరబాటు. అందుబాటులో ఉండే కూరగాయలూ, ఆకుకూరల్లోనూ పుష్కలంగా లభిస్తాయి. అలాంటివాటిల్లో మునగ ప్రత్యేకమైనది. మరి దాని గురించి తెలుసుకుందామా...

Updated : 17 Oct 2021 07:03 IST

ప్రొటీన్లూ, విటమిన్‌లూ...ఇతర పోషకాలు ఖరీదైన ఆహారంలో మాత్రమే ఉంటాయనుకోవడం పొరబాటు. అందుబాటులో ఉండే కూరగాయలూ, ఆకుకూరల్లోనూ పుష్కలంగా లభిస్తాయి. అలాంటివాటిల్లో మునగ ప్రత్యేకమైనది. మరి దాని గురించి తెలుసుకుందామా...

* మునగలో క్యాల్షియం, ఐరన్‌లతో పాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రొటీన్‌లు, విలువైన ఖనిజాలు అధికమోతాదులో లభిస్తాయి. ఇవి ఎముక బలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఆస్టియోపోరోసిస్‌ సమస్య రాకుండా కాపాడగలవు.

* వీటి గింజలకూ రక్త శుద్ధికి తోడ్పడే లక్షణాలు ఉన్నాయి. మధుమేహ బాధితులు మునగాకు తింటే రక్తంలోని గ్లూకోజ్‌ నిల్వలు నియంత్రణలో ఉంటాయి.

* మునగలోని విటమిన్‌ సి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అదుపులో ఉంటాయి.

* శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి చక్కని ఔషధం మునగ. శరీర వ్యర్థాలను బయటకు పంపించే శక్తి ఇందులోని పోషకాలకు ఉంది. ప్రసవ ఇబ్బందుల్ని తగ్గించగలవు. తల్లిపాలను వృద్ధి చేయగలవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్