Published : 20/10/2021 00:55 IST

ఆహారంతో ఉల్లాసం

డైట్‌ పేరుతో రజనీ కొన్ని ఆహార పదార్థాలనే తింటుంది. ఫలితం బాగున్నా మనసంతా నిరుత్సాహమే! కారణం తెలియడంలేదామెకు. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. అవేంటో సూచిస్తున్నారిలా..
* మనసు బాలేదనిపిస్తే ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాన్ని ప్రయత్నించండి. అక్రూట్‌, బాదం, వేరుశనగ, సాల్మన్‌, ట్యూనా చేపలు, చియా విత్తనాలు, సోయాబీన్స్‌, అవిసెలు వంటివాటిని ఆహారంలో చేర్చుకోవాలి. మెదడులోని రక్తప్రసరణను ఇవి సమతుల్యం చేస్తాయి. దాంతో మానసిక ఆందోళన దూరమవుతుంది.
* లాక్‌డౌన్‌ తర్వాత మహిళలకు ఉద్యోగమేకాదు, కుటుంబపరంగానూ ఒత్తిడీ, సవాళ్లు పెరిగాయి. వీటి ప్రభావం పడేది మనసుపైనే. ఇందుకు బెర్రీస్‌, పెరుగు, బాదం, డార్క్‌ చాక్లెట్‌, అరటిపండ్లు, గుడ్లు తీసుకోవాలి. ఇవి సెరోటోనిన్‌ స్థాయులను పెంచి మానసిక స్థితిని ఉత్సాహంగా మారుస్తాయి.
* ఎసిడిటీ, అజీర్తి వంటివీ భావోద్వేగాలపై ప్రభావం చూపేవే. ప్రొబయాటిక్‌ రిచ్‌ ఫుడ్స్‌ అయిన పెరుగు, బ్రౌన్‌ బ్రెడ్‌, బఠానీ, వెల్లుల్లివంటివి వీటికి మంచి ఔషధాలు. అలాగే చక్కెర, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కూ దూరంగా ఉండటంతోపాటు శరీరానికి తగినంత ఇనుము అందేలానూ చూసుకోవాలి. ఇందుకు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, మాంసాహారం, బ్రకోలీ, పప్పుధాన్యాలు చేర్చుకోవాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని