నెలసరిలో...

బిందుకు నెలసరి దగ్గరపడే ప్రతి సారీ భయం మొదలవుతుంది. కడుపునొప్పి, తలనొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఇంటిపని చేయాలంటే శరీరం సహకరించదు. ఆఫీస్‌కు వెళ్లాలనిపించదు. అయితే నాసియా,

Updated : 21 Oct 2021 06:39 IST

బిందుకు నెలసరి దగ్గరపడే ప్రతి సారీ భయం మొదలవుతుంది. కడుపునొప్పి, తలనొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఇంటిపని చేయాలంటే శరీరం సహకరించదు. ఆఫీస్‌కు వెళ్లాలనిపించదు. అయితే నాసియా, డయేరియా, మూడ్‌స్వింగ్స్‌ వంటివి కూడా నెలసరిలో కొందరిని బాధిస్తాయంటున్నారు వైద్యులు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

ఆకు కూరలు... ఐరన్‌ పుష్కలంగా ఉండే ఆకు కూరలను నెలసరి సమయంలో ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వంటల్లోనే కాకుండా సలాడ్లు, స్మూతీల రూపంలో కూడా వీటిని తీసుకుంటే శరీరానికి తగినంత ఐరన్‌ అందుతుంది.

అరటిపండ్లు... పొటాషియం, బీ6 విటమిన్‌ ఉండే అరటిపండును నెలసరిలో తప్పని సరిగా తీసుకోవాలి. ఇది కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. నిస్సత్తువగా మారిన శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఈ సమయంలో చక్కెర స్థాయులు తగ్గినప్పుడు డార్క్‌ చాక్లొట్‌ను తినాలి. ఇందులోని మెగ్నీషియం  నొప్పిని అదుపులో ఉంచి శక్తిని ఇస్తుంది. ఇందులోని ఎండార్ఫిన్స్‌తో హ్యాపీ హార్మోన్లు విడుదలై మెదడును ఉల్లాసంగా మారుస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడొచ్చు.

పెరుగు... సూపర్‌ఫుడ్‌గా పిలిచే పెరుగులో కాల్షియం ఉంటుంది. పొత్తికడుపు నొప్పిని తగ్గిస్తుంది. మూడ్‌స్వింగ్స్‌ను దూరంగా ఉంచుతుంది. ఇ విటమిన్‌ ఎక్కువగా ఉండే గింజలు, ఎండు ఫలాలు నెలసరి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

సాల్మన్‌... ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే సాల్మన్‌ చేపను ఆసమయంలో ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. కనీసం వారంలో రెండుమూడు సార్లు ఈ చేపను భోజనంలో చేర్చుకోవాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. మాంసాహారం తిననివారు దీనికి బదులుగా ఫ్లాక్స్‌ సీడ్స్‌, వేరుసెనగ, సోయాబీన్స్‌ను తీసుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్