ఇవి తింటే... బరువు తగ్గొచ్చు

శరీరంలో కెలొరీలు పెరగాలంటే ప్రత్యేకంగా ఆహారం తీసుకుంటాం. కొన్ని రకాల ఆహారంతో కెలొరీలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఈ ‘నెగటివ్‌ కెలొరీ ఫుడ్‌’ గురించి తెలుసుకుందాం. రెండు రకాలు... కెలోరీలు రెండు రకాలు. ఆహారం ద్వారా పెరిగే కెలోరీల్లో మొదటి రకంలో పోషక గుణాలు తక్కువగా ఉండి బరువును మాత్రమే పెంచడానికి సహకరిస్తాయి. రెండోరకంలో పీచు, నీరు

Updated : 22 Oct 2021 13:03 IST

శరీరంలో క్యాలరీలు పెరగాలంటే ప్రత్యేకంగా ఆహారం తీసుకుంటాం. కొన్ని రకాల ఆహారంతో క్యాలరీలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఈ ‘నెగెటివ్‌ క్యాలరీ ఫుడ్‌’ గురించి తెలుసుకుందాం.

రెండు రకాలు... క్యాలరీలు రెండు రకాలు. ఆహారం ద్వారా పెరిగే క్యాలరీల్లో మొదటి రకంలో పోషక గుణాలు తక్కువగా ఉండి బరువును మాత్రమే పెంచడానికి సహకరిస్తాయి. రెండోరకంలో పీచు, నీరు అత్యధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. శరీరానికి వచ్చే క్యాలరీల కన్నా జీర్ణమవడానికి ఎక్కువ ఖర్చు అవుతాయి. ఈ నెగెటివ్‌ క్యాలరీ ఫుడ్‌ మాత్రమే బరువు సమస్యను దూరంగా ఉంచుతుంది.

ఆకుకూరలో... సెలరీ ఆకు కూరలో పీచు ఎక్కువ. ఏ, సీ విటమిన్లు, ఫోలేట్‌ పుష్కలం. జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. తద్వారా శరీరం అతితక్కువ క్యాలరీలు పొందుతుంది. అలాగే బ్లూ, స్ట్రా, రాస్‌బెర్రీస్‌ను అరకప్పు తీసుకుంటే వీటిలోని తక్కువస్థాయి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (జీఐ), ప్రొటీన్లు క్యాలరీలను పెంచవు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలను దరి చేరనివ్వవు.

కాయగూరలు... పీచు, పొటాషియం, సి విటమిన్‌, లైకోపిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టొమాటోతో బరువు తగ్గొచ్చు. క్యారట్‌లో పీచు అధికం. తక్కువ తీసుకున్నా కడుపు నిండినట్టుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. బ్రకలీలోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ కె, ఐరన్‌ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనత రాకుండా కాపాడతాయి. మెదడును చురుకుగా ఉంచుతాయి. ముఖ్యంగా బరువు సమస్యను దూరం చేస్తుంది. కీరదోసలో నీటిశాతంతోపాటు విటమిన్లు, ఖనిజాలు, పీచు ఎక్కువ. ఇది జీర్ణమవడానికి అధిక శక్తి అవసరం.

పండ్లు.. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. అలాగే ఏ, బీ6, సీ విటమిన్లు, లైకోపిన్‌ ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. హృద్రోగాలను దరి చేరనివ్వదు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్