వయసు తగ్గాలా... వర్కవుట్లు చేయండి!

వ్యాయామం వల్ల దీర్ఘకాల వ్యాధుల నుంచి బయటపడొచ్చు. కండరాలతోపాటు శరీరాన్నీ దృఢంగా మలుచుకోవచ్చు. మనసూ, తనువూ రెండూ చురుగ్గా ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న వ్యాయామాన్ని చేసేస్తే పోలా? ఏం చేయాలి అంటారా? అయితే చూడండి... ఇది ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సాయపడుతుందన్నది నిపుణుల మాట. చురుకుగా ఉంచడంతో పాటు వయసునీ కనిపించ నీయదు. ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యపాత్ర

Published : 22 Oct 2021 01:50 IST

వ్యాయామం వల్ల దీర్ఘకాల వ్యాధుల నుంచి బయటపడొచ్చు. కండరాలతోపాటు శరీరాన్నీ దృఢంగా మలుచుకోవచ్చు. మనసూ, తనువూ రెండూ చురుగ్గా ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న వ్యాయామాన్ని చేసేస్తే పోలా? ఏం చేయాలి అంటారా? అయితే చూడండి...

యోగా: ఇది ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సాయపడుతుందన్నది నిపుణుల మాట. చురుకుగా ఉంచడంతో పాటు వయసునీ కనిపించ నీయదు. ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.

బరువులెత్తడం... మనలో చాలామంది వెయిట్‌ లిఫ్టింగ్‌కు దూరంగా ఉంటారు. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే బరువులెత్తాల్సిందే. ఆస్టియో పోరోసిస్‌ను ఎదుర్కోవడంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ సాయపడుతుంది. అయితే నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలోనే చేయాలి.

స్క్వాట్స్‌... ఇవి శరీరంలోని పెద్ద కండరాలను లక్ష్యంగా పనిచేస్తాయి. కెలొరీలను కరిగించడమే కాకుండా కాళ్లను బలంగా ఉంచుతాయి. బరువులు ఎత్తడం, చిన్నారులను ఎత్తుకోవడం... ఇవన్నీ సహజమైన స్క్వాట్సే. అయితే సరైన తీరులో చేయకపోతే గాయాలయ్యే ప్రమాదం ఉంది.

నడక... నడవడం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం మూడింట ఒక వంతు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నడక గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్