Updated : 24/10/2021 06:23 IST

జుట్టుకు... పోషకాలు!

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలా... చుండ్రు పోవాలా... వెంట్రుకలు చిట్లకుండా ఉండాలా... అయితే కొన్ని రకాల పూతలు వేయాల్సిందే మరి.

ల్లంలోని యాంటీ సెప్టిక్‌ సమ్మేళనాలు చుండ్రును తగ్గిస్తాయి. రెండు చెంచాల అల్లం రసం, మూడు చెంచాల నువ్వుల నూనె, చెంచా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. కాసేపాగి గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేయాలి. వారంలో ఒకట్రెండుసార్లు చేస్తే చుండ్రు పోతుంది. చెంచా చొప్పున అల్లం రసం, జొజొబా ఆయిల్‌ కలిపి మాడుకు చక్కగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు చక్కగా పెరుగుతుంది.

చక్కెర... షాంపూలో చెంచా పంచదార కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది మురికి, మాడుపై పేరుకు పోయిన మృతకణాలను తొలగిస్తుంది. దాంతో వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

ఉల్లిరసం... ఇందులోని ఫాస్ఫరస్‌ జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా, బలంగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ మూలకం జుట్టు పెరుగుదలకు కారణమయ్యే కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని