తగ్గాలంటే.. నిలబడాలి!

ఏంటి.. నమ్మశక్యంగా లేదా? నిజమండీ బాబూ! ఫిన్‌లాండ్‌ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. నిల్చోవడం వల్ల ఇంకెన్ని ప్రయోజనాలున్నాయో కూడా చెప్పింది. కావాలంటే చదివేయండి.

Published : 25 Oct 2021 02:09 IST

ఏంటి.. నమ్మశక్యంగా లేదా? నిజమండీ బాబూ! ఫిన్‌లాండ్‌ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. నిల్చోవడం వల్ల ఇంకెన్ని ప్రయోజనాలున్నాయో కూడా చెప్పింది. కావాలంటే చదివేయండి.

గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో కెలొరీలు పోగవుతాయి. కేవలం నిల్చోవడం ద్వారానే వాటిని కరిగించేయొచ్చు. ఎక్కువసేపు నిలబడితే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. దీంతో గ్లూకోజ్‌ రక్తంలోనే ఉండి, కణాలకు చేరదు. తద్వారా చెడు కొలెస్టరాల్‌ తగ్గడంతోపాటు బరువూ అదుపులో ఉంటుందట.

ఇంకా.. ఎక్కువ సేపు నిలబడటం దీర్ఘకాలిక వ్యాధులను దరిచేరనీయదు. ఇన్సులిన్‌ ఉత్పత్తిని మెరుగుపరిచి మెటబాలిజం సరిగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ భంగిమ శరీరం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేస్తుందట. ఫలితంగా కెలోరీలు ఎక్కువగా ఖర్చవుతాయట. అంతేకాదు మధుమేహం, గుండెనొప్పి వంటివాటినీ దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు. వీలున్నప్పుడల్లా నిల్చోండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్