మాతృత్వాన్ని ఆస్వాదించాలంటే...

కాబోయే తల్లి ప్రసవం తర్వాత మాతృత్వాన్ని సంతోషంగా ఆస్వాదించాలంటే శారీరక, మానసికారోగ్యం తప్పనిసరి అంటున్నారు మానసిక నిపుణులు. అదెలాగో చెబుతున్నారు.

Updated : 27 Oct 2021 13:54 IST

కాబోయే తల్లి ప్రసవం తర్వాత మాతృత్వాన్ని సంతోషంగా ఆస్వాదించాలంటే శారీరక, మానసికారోగ్యం తప్పనిసరి అంటున్నారు మానసిక నిపుణులు. అదెలాగో చెబుతున్నారు.

* ఒత్తిడి... కాబోయే తల్లిలో ఒత్తిడి సహజం. మనసులో ఎన్నో భయాలుంటాయి. వీటితోపాటు ప్రస్తుత ఆహారపుటలవాట్లు, జీవనవిధానంతోడై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. దీన్నుంచి బయట పడాలంటే మెడిటేషన్‌ చాలా మంచిదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఒత్తిడిని దూరం చేయడంతోపాటు భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఆందోళన, మానసికంగా దిగులు, ప్రతికూల ఆలోచనలను దరిచేరకుండా కాపాడుతుంది. సానుకూలంగా ఆలోచించేలా చేసి, మనసును ఉల్లాసంగా మారుస్తుంది.
* యోగా... శరీరాన్ని, మనసునూ తేలికగా ఉంచే శక్తి యోగాకు ఉంది. అవయవాలన్నీ ఆరోగ్యంగా, రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేయగలదు. శ్వాస సమస్యలను దూరంగా ఉంచుతుంది. అతి నీరసం, కండరాలు పట్టేయడం, పాదాల వాపు వంటి సమస్యలను దరి చేరనివ్వదు. మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. గర్భం దాల్చినప్పుడు సాధారణంగా కనిపించే రక్తంలో పెరిగే చక్కెర స్థాయులు, అధిక రక్తపోటు వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని ప్రతి కణాన్నీ రిలాక్స్‌డ్‌గా మార్చేస్తుంది. శరీరంలోని వేడిని సమతుల్యం చేస్తూ, గర్భంలోని శిశువుకు ఆక్సిజన్‌ తగినంతగా అందేలా తోడ్పడుతుంది. అధిక బరువుని అదుపులో ఉంచుతుంది.
* సంగీతంతో... మ్యూజిక్‌ థెరపీని అలవరుచుకోవాలి. నిద్రకు ముందు, ఖాళీ సమయాల్లో మనసుకు నచ్చిన సంగీతాన్ని వింటే శరీరం, మనసు రిలాక్స్‌డ్‌గా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రోన్యూట్రియంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పాలీఫినాల్స్‌, కెరొటినాయిడ్స్‌, పొటాషియం, ఇ, సి విటమిన్లు, సెరటోనిన్‌ ఉండే ఆహార పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. పుట్టబోయే పాపాయి ఆరోగ్యంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్