బరువు తగ్గట్లేదా...

బరువు తగ్గాలనేది చాలామంది కోరిక. కానీ... ఎన్ని వ్యాయామాలు చేస్తున్నా అదుపులోకి రావడం లేదంటే ఆహారపుటలవాట్లను గమనించుకోవాలి. ముఖ్యంగా మీరు తినే వాటిల్లో ఇవి లేకుండా చూసుకోండి.

Updated : 30 Oct 2021 06:11 IST

బరువు తగ్గాలనేది చాలామంది కోరిక. కానీ... ఎన్ని వ్యాయామాలు చేస్తున్నా అదుపులోకి రావడం లేదంటే ఆహారపుటలవాట్లను గమనించుకోవాలి. ముఖ్యంగా మీరు తినే వాటిల్లో ఇవి లేకుండా చూసుకోండి.

నిల్వ, ప్రాసెస్డ్‌ ఆహారంలో కాస్త ఉప్పు ఎక్కువే ఉంటుంది. వాటిని దరిచేరనీయకండి. ఇంట్లోనూ ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించండి. లేదంటే...సోడియం తక్కువగా ఉండే రకాన్ని ఎంచుకోండి. లేదంటే మీ బరువులో ఏ మార్పూ ఉండకపోవచ్చు.

* ఫ్రెంచ్‌ఫ్రైస్‌, పొటాటో చిప్స్‌.... లాంటి జంక్‌ఫుడ్‌లో కెలొరీలు ఎక్కువ. పోషకాలు తక్కువ. అవి జీర్ణ ప్రక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపించడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది.

క్యాన్డ్‌, టిన్డ్‌ జ్యూస్‌లు, సోడాలు తరచూ తాగుతున్నారా? ఇందులో నిల్వకారక రసాయనాలు, షుగర్‌, సాల్ట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊబకాయానికి కారణమవుతాయి.

* క్యాండీ బార్లు/స్వీట్లలో చాలా వరకూ అనారోగ్యాన్ని కలిగించేవే. అధికమోతాదులో చక్కెర్లు, నూనెలు, రిఫైన్డ్‌ ఫ్లోర్‌ వంటివన్నీ కలిపి చేసే ఇవి బరువుని పెంచేస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలనే నియమం తప్పదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్