మస్కారాతో కళ్లను మెరిపిద్దాం!

కళ్లు కలువ రేకుల్లా కనిపించాలంటే...రెప్పలకు కాస్త మస్కారా జోడించాల్సిందే. మరి దీన్ని వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా!

Updated : 30 Oct 2021 13:17 IST

కళ్లు కలువ రేకుల్లా కనిపించాలంటే...రెప్పలకు కాస్త మస్కారా జోడించాల్సిందే. మరి దీన్ని వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా!

స్కారా వేసుకునే ముందు సీసాని పైకీ కిందకీ కదపకండి. అరచేతిలో పెట్టుకుని అటూ ఇటూ దొర్లిస్తే రంగు బ్రష్‌కి చక్కగా అంటుకుంటుంది.

* కనురెప్పలకు వేసుకునేటప్పుడు కాస్త పెట్రోలియం జెల్లీని కంటి చుట్టూ రాసుకుంటే అంటుకోదు. అలానే కళ్లు విప్పార్చి కింద నుంచి పైకి వేయడం వల్ల చక్కగా కనిపిస్తాయి.

* మస్కారా మందంగా కనిపించాలంటే... కాస్త బేబీ పౌడర్‌ అద్ది వేయండి. లేదంటే ఓ సారి వేశాక ఆరనిచ్చి మరోసారి వేయొచ్చు. అలానే ఐలాష్‌ కర్లర్‌తో నొక్కి వేస్తే వెంట్రుకలకు చక్కగా అంటుకుని కళ్లు అందంగా కనిపిస్తాయి.

* ఇతరుల మస్కారానీ, గడువు దాటిన వాటినీ అసలు వాడొద్దు. ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. అలానే నిద్రపోయే ముందు తప్పనిసరిగా రంగుని తుడిచేయాలి. లేదంటే వెంట్రుకలు గట్టిపడి రాలిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కంటికీ హాని జరగొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్