చలితో చర్మం జాగ్రత్త

వాతావరణానికి తగినట్లుగా చర్మం స్పందిస్తుంది. చలిగాలులు వీచేటప్పుడు చర్మం కుచించుకుపోతుంది. ముఖంపై ముడతలు మొదలవుతాయి. పొడిగా, పగిలినట్లుగా మారుతుంది. ఇలా కాకుండా తాజాగా ఉండేలా ముఖాన్ని సంరక్షించుకోవాలంటే సౌందర్యనిపుణులు...

Updated : 31 Oct 2021 05:31 IST

వాతావరణానికి తగినట్లుగా చర్మం స్పందిస్తుంది. చలిగాలులు వీచేటప్పుడు చర్మం కుచించుకుపోతుంది. ముఖంపై ముడతలు మొదలవుతాయి. పొడిగా, పగిలినట్లుగా మారుతుంది. ఇలా కాకుండా తాజాగా ఉండేలా ముఖాన్ని సంరక్షించుకోవాలంటే సౌందర్యనిపుణులు ఇంట్లోనే చేసుకునే కొన్ని మాయిశ్చరైజర్లను చెబుతున్నారు. త్వరితగతిన చర్మాన్ని మెరిపించే వీటిని సులువుగానూ తయారు చేసుకోవచ్చు.

కోడిగుడ్డు పసుపుసొనను ఓ గిన్నెలో విడిగా తీసుకోవాలి. అందులో చెంచా నిమ్మరసం, రెండు చుక్కల అవకాడో నూనె, చిటికెడు సీసాల్ట్‌ వేసి మిక్సీలో మయోనైజ్‌ను తయారుచేసుకోవాలి. మాయిశ్చరైజింగ్‌ గుణాలు పుష్కలంగా ఉండే దీన్ని రెండు చెంచాలు తీసుకుని చెంచా బేబీ ఆయిల్‌ను కలిపి ముఖానికి రాసి మర్దనా చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే పసిపిల్లల చర్మంలా మృదువుగా మారడమే కాదు మెరుపులీనుతుంది.

* కోడిగుడ్డులోని పసుపుసొనకు విటమిన్‌ ఇ, ఫాటీ యాసిడ్స్‌, ప్రొటీన్లు, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే బాదం నూనెను రెండు చెంచాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరనిచ్చి కడిగేయాలి. ఇది చర్మం ఏ వాతావరణంలోనైనా మృదువుగా ఉండేలా సంరక్షిస్తుంది.

* రెండు చెంచాల కలబంద గుజ్జుకు సమాన పరిమాణంలో తేనె, బాదంనూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి ఓ అరగంట ఆరనివ్వాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు.

* రెండు చెంచాల కొబ్బరి నూనెకు సమాన పరిమాణంలో  తేనె కలిపి ముఖం, మెడకు మర్దన చేయాలి. ఓ అరగంట ఆగి నీటితో కడిగితే చాలు. ముఖం తేమగా మారుతుంది.

* అరటిపండును గుజ్జులా చేసి, రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. యాంటీ బాక్టీరియల్‌ గుణాలున్న తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్