Published : 01/11/2021 21:30 IST

రొమ్ము క్యాన్సర్‌ తగ్గించే సైక్లింగ్‌

కసరత్తులు కష్టంగా కాకుండా... కాస్త సరదాగానూ ఉండాలని కోరుకుంటారు కొందరు. అలాంటివారికి సైక్లింగ్‌ చక్కటి సాధనం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగానూ చేసేయొచ్చు. దృఢంగా ఉండొచ్చు.

* కాస్త విసుగ్గా ఉన్నప్పుడు సైక్లింగ్‌ చేస్తే.. క్షణాల్లో చిరాకు మాయమై మనసంతా హాయిగా ఉంటుంది. సైకిల్‌ తొక్కుతున్నప్పుడు మెదడులో విడుదలయ్యే డోపమైన్‌ అనే హార్మోన్‌ మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది. శక్తినీ అందిస్తుంది. 

* ఒక వయసుకు వచ్చేసరికి మహిళల్లో ఎముకలు బలహీనంగా మారతాయి. దాంతో కీళ్ల నొప్పులూ ప్రారంభమవుతాయి. సైకిల్‌ తొక్కడం వల్ల మోకాళ్లు, మోచేతులు, ముంజేతుల దగ్గరి ఎముకలు చురుగ్గా, దృఢంగా మారతాయి. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  

* సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం మొత్తానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగి శరీరంలోని అన్ని భాగాలకూ సరిపడినంత ఆక్సిజన్‌ అందుతుంది. మెనోపాజ్‌ ముందూ, తరువాత దశల్లో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది.

* ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా అధిక బరువును తగ్గించుకోవడానికీ సైక్లింగ్‌ తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులను నియంత్రిస్తుంది. అంతేకాదు శరీరమూ చురుగ్గా మారుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని