ఇక మీతో పోటీపడేదెవరు?

ఇల్లాలికి 40 ఏళ్లు వచ్చేసరికి ఇంటాబయటా చాలా మార్పులు జరుగుతాయి. వయోభారం వల్ల అత్తగారి సహకారం తగ్గి ఇంటి పని పెరుగుతుంది. పిల్లల పేచీలు అధికమై  ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆఫీసులోనూ కొంచెం కీలక బాధ్యతలు చేపట్టడంతో పని పెరుగుతుంది.

Updated : 04 Nov 2021 06:29 IST

ఇల్లాలికి 40 ఏళ్లు వచ్చేసరికి ఇంటాబయటా చాలా మార్పులు జరుగుతాయి. వయోభారం వల్ల అత్తగారి సహకారం తగ్గి ఇంటి పని పెరుగుతుంది. పిల్లల పేచీలు అధికమై  ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆఫీసులోనూ కొంచెం కీలక బాధ్యతలు చేపట్టడంతో పని పెరుగుతుంది. అన్నీ కలిసి అలసట కలిగి, చలాకీతనం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అప్పుడే అలసట, అసహనం లేకుండా హుషారుగా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

* డ్రై ఫ్రూట్స్‌: బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌, కర్బూజా, గుమ్మడి తదితర గింజల్లో పోషకాలు, పీచుపదార్థం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. వీటిని మార్చిమార్చి తింటుండాలి. రోజుకు నాలుగైదు గింజల్ని నానబెట్టి తింటే సరిపోతుంది.
* గోధుమలు: అన్నానికి బదులు తరచుగా చపాతీ తినడం వల్ల రక్తంలో షుగర్‌ లెవెల్‌ సమతులంగా ఉంటుంది.

* తాజా పండ్లు: వీటిలో విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు విస్తారంగా ఉంటాయి. స్వీట్లు, ఇతరత్రా జంక్‌ఫుడ్‌కు బదులు ఆయా సీజన్లలో దొరికే పండ్లు తినడం వల్ల డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు తక్కువని తేలింది.
* నెయ్యి: ఇందులో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ ఉంటుంది. తక్కువ పరిమాణంలో తప్పక తినమంటున్నారు వైద్యులు.
* క్యారెట్‌: ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్‌, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండి యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా కళ్ల సమస్యలను అరికడతాయి.

* ఆకుకూరలు: తోటకూర, బచ్చలికూర, గోంగూర, కొత్తిమీద లాంటివి తినడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అందుతాయి. ఊబకాయం రాదు. రక్తపోటు, హృద్రోగాల బారిన పడకుండా చేస్తాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి.

  * అన్నిటినీ మించి పెద్దగా ఆకలి లేదు లెమ్మని టిఫిను లేదా భోజనం ఎగ్గొట్టేయడం, వేళ ప్రకారం తినకపోవడం, తీపి పదార్థాలు లేదా జంక్‌ఫుడ్‌ తరచుగా తినడం- ఇవన్నీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. యాంగ్జయిటీ, డిప్రెషన్‌ల బారిన పడేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్