పోషకాల సలాడ్‌... మొలకల చాట్‌!

ఒక్కోసారి బద్ధకంగా ఉండి వంట చేయాలనిపించదు. అలాంటప్పుడు సులువుగా చేసే కొన్ని పదార్థాలివీ. వీటికి గ్యాస్‌ అవసరం లేదు. రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేసే అవేంటో చూసేద్దామా... ఉదయం పూట ఉరుకులు పరుగులు పెడుతున్న వేళ శరీరానికి ఇది పోషణనూ, శక్తిని అందిస్తుంది. గ్యాసూ అవసరం లేదు, తయారు చేయడానికి పట్టే సమయమూ తక్కువే. చాపర్‌ ఉంటే మీ పని మరింత...

Published : 06 Nov 2021 00:54 IST

ఒక్కోసారి బద్ధకంగా ఉండి వంట చేయాలనిపించదు. అలాంటప్పుడు సులువుగా చేసే కొన్ని పదార్థాలివీ. వీటికి గ్యాస్‌ అవసరం లేదు. రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేసే అవేంటో చూసేద్దామా...

సలాడ్‌...

ఉదయం పూట ఉరుకులు పరుగులు పెడుతున్న వేళ శరీరానికి ఇది పోషణనూ, శక్తిని అందిస్తుంది. గ్యాసూ అవసరం లేదు, తయారు చేయడానికి పట్టే సమయమూ తక్కువే. చాపర్‌ ఉంటే మీ పని మరింత సులువు.

తయారు చేసేయండిలా..

కాలానుగుణంగా దొరికే పండ్లు లేదా మీకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఓ గిన్నెలో వేసుకోవాలి. అన్ని ముక్కలనూ ఒకే సైజ్‌లో ఉండేలా కోసుకోవాలి. ఇలా ఉంటే చూడటానికి బాగుంటుంది. ఈ ముక్కల్లో రెండు చెంచాల నిమ్మరసం, అర చెంచా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, చక్కెర; ఇష్టమైతే ఓ గుప్పెడు ఎండు ఫలాలు వేసుకోవచ్చు. అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన సలాడ్‌ సిద్ధమైనట్లే. దీన్ని కేవలం పండ్లకే  పరిమితం చేయొద్దు. పుదీనా, తులసి, కొత్తిమీరలను జత చేస్తే రుచి పెరగడంతోపాటు ఆరోగ్యానికీ మంచిది.

పెసర్ల మొలకల చాట్‌...

ఏమేం కావాలంటే..

పెసర్లు- కప్పు, ఉల్లిపాయ, క్యారెట్‌ ముక్కలు- అర కప్పు చొప్పున, కారం, ఉప్పు- రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, మిరియాల పొడి- అర చెంచా.

తయారీ... పెసర్ల మొలకల్లో ఉల్లిపాయ, క్యారెట్‌ ముక్కలను కలపాలి. ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. కేవలం ఉల్లిపాయ, క్యారెట్‌ ముక్కలే కాకుండా మొలకల్లో కీరా, టొమాటో ముక్కలనూ జత చేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్