కాబోయే అమ్మలూ.. కంగారొద్దు

ప్రగతి నాలుగు నెలల గర్భిణి. ఏం తిన్నా వాంతి అయిపోతోంది. ఉదయం మత్తుగా ఉండటం, ఏమీ తినాలనిపించపోవడం... లాంటిఎన్నో లక్షణాలతో బాధపడుతోంది. చాలామంది గర్భధారణ వేళ ఇలా ఇంకా రకరకాల ఆరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కొంటారు. అవేంటో చూద్దామా...

Updated : 07 Nov 2021 04:49 IST

ప్రగతి నాలుగు నెలల గర్భిణి. ఏం తిన్నా వాంతి అయిపోతోంది. ఉదయం మత్తుగా ఉండటం, ఏమీ తినాలనిపించపోవడం... లాంటిఎన్నో లక్షణాలతో బాధపడుతోంది. చాలామంది గర్భధారణ వేళ ఇలా ఇంకా రకరకాల ఆరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కొంటారు. అవేంటో చూద్దామా...

* చర్మం సాగడం... మూడో త్రైమాసికంలో అడుగు పెట్టిన గర్భిణులు కొందరిలో ముఖ చర్మం సాగుతుంది. హార్మోన్లలో మార్పుల వల్ల అలా జరగొచ్చు. ప్రసవం తర్వాత మామూలుగా అవుతుంది. అలా కాకపోతే మాత్రం వైద్యులను సంప్రదించాలి.

* త్రేేన్పులు... కొందరు గర్భిణుల్లో ఏం తిన్నా వెంటనే పెద్దపెద్దగా త్రేన్పులు వస్తాయి. ఇది నలుగురిలో ఉన్నప్పుడు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే ఇది సాధారణమే కాబట్టి ఆందోళన పడొద్దు.

* మూత్రం నియంత్రించుకోలేక పోవడం... సాధారణంగా గర్భిణుల్లో మూత్రాన్ని నియంత్రించుకోవడం ఇబ్బందే. కొన్ని హార్మోన్లు కటి వలయంలోని నాడులు విశ్రాంతి చెందేలా సంకేతాలను పంపుతాయి. దీంతో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తెలియకుండానే మూత్రం పడిపోతుంది.

* మట్టి తినాలనిపించడం.. ఈ సమయంలో కొందరికి మట్టి, చాక్‌పీస్‌, మొక్కజొన్న పిండి, బియ్యం, సబ్బు... ఇలా రకరకాల పదార్థాలు తినాలనిపిస్తుంది. ఇలా పదే పదే అనిపించినప్పుడు తప్పక వైద్యులను సంప్రదించాలి.

* గోళ్లు పెరుగుతాయి... ఈ సమయంలో గోళ్లు త్వరగా పెరుగుతాయి. వీటిని కత్తిరించుకుంటూ ఉండాలి. తరచూ అపానవాయువు రిలీజ్‌ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి పొట్టలో శిశువు బరువు వల్ల ఇది అప్పటికప్పుడు బయటకు వెలువడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్