ఆరోగ్యమే అందం.. ఆనందం

ఆడపిల్లలందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం రకరకాల క్రీములూ లోషన్లూ, మాయిశ్చరైజర్లు రాస్తుంటారు. ఇవన్నీ పైపై మెరుగులేనని, ఒక్కోసారి వాటిలోని రసాయనాలు హాని కూడా చేస్తాయనీ చెబుతున్నారు నిపుణులు.

Updated : 10 Nov 2021 06:04 IST

ఆడపిల్లలందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం రకరకాల క్రీములూ లోషన్లూ, మాయిశ్చరైజర్లు రాస్తుంటారు. ఇవన్నీ పైపై మెరుగులేనని, ఒక్కోసారి వాటిలోని రసాయనాలు హాని కూడా చేస్తాయనీ చెబుతున్నారు నిపుణులు. మరి ప్రత్యామ్నాయం ఏమిటంటారా... ఈ చిన్న చిన్న సూత్రాలు పాటించండి చాలు...

దాహమేస్తేనే నీళ్లు తాగాలనుకోకండి. రోజుకు పన్నెండు గ్లాసుల నీళ్లు తాగితే అదే సగం ఆరోగ్యం. శరీరంలో ఉన్న దోషకారకాలన్నీ వెళ్లిపోతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

* ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నవి తగ్గించండి. కుకీస్‌, చాక్లెట్లు తరచుగా తినకండి. అవి ఇన్సులిన్‌ని, కొవ్వును పెంచుతాయి. విటమిన్లు, క్యాల్షియం ఉన్న పోషకాహారాన్ని తీసుకోండి.

* తిండీ నిద్రలకు వేళలు పాటించకుంటే మంచిది కాదని డాక్టర్లు పదేపదే హెచ్చరిస్తున్నారు. అందువల్ల తినడం, పడుకోవడం ఓ గంట ముందూ వెనకా అయితే ఏమైందిలే అనుకోకండి. కచ్చితమైన వేళలు నిర్థరించుకోండి.

* ఆరోగ్యానికీ బరువుకీ అవినాభావ సంబంధముంది. కనుక దాన్ని నిర్లక్ష్యం చేయకండి. బరువు తగ్గినా, హెచ్చినా శరీరంలో ఏదో తేడా ఉందని అర్థం. సరైన ఆహారం తింటున్నారా లేదా, సవ్యంగా వ్యాయామం చేస్తున్నారా లేదా అని పరిశీలించుకోండి. బరువులో మరీ తేడా ఉంటే డాక్టర్ని సంప్రదించి థైరాయిడ్‌ పరీక్ష మొదలైనవి చేయించుకోండి.

* ఏదైనా వేదనకు గురిచేస్తోంటే మనసులోనే కుమిలిపోకండి. అది శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది. స్వయంగా పరిష్కరించుకోలేకపోతే ఆత్మీయుల సలహా, సహకారం తీసుకోండి. లేదంటే ముఖంలో ముడతలు, కళ్లకింద చారలు తప్పవు.

* బాధ్యతలు ఎక్కువై అలసటగా, ఆందోళనగా ఉంటే బంధుమిత్రులతో కొంతసేపు హాయిగా కబుర్లు చెప్పండి. అదెంత ఊరటనిస్తుందో, మనసు తేలిక పడుతుందో మీకే అర్థమవుతుంది.

* ఆరోగ్యంగా ఉంటే ఫేస్‌ప్యాక్‌లూ గట్రా లేకుండానే ముఖంలో వర్ఛస్సూ శరీరంలో కాంతి సహజంగానే వచ్చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్