చలి నుంచి రక్షణగా..

చలికాలంలో ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లోనే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. వాటి నుంచి రక్షణ కల్పించే ఆహారం ఇది..

Updated : 16 Nov 2021 05:22 IST

చలికాలంలో ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లోనే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. వాటి నుంచి రక్షణ కల్పించే ఆహారం ఇది..

పోషకాల లడ్డూ... నెయ్యి, డ్రైఫ్రూట్స్‌, రాగిపిండితో చేసిన లడ్డూలు శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు తగినంత వేడిని, రక్షణను అందిస్తాయి. వీటిని తింటే రోగనిరోధకత పెరుగుతుంది. దాంతో ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వీటి వల్ల పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. దాంతో బరువూ నియంత్రణలో ఉంటుంది. రోజూ ఉదయం పాలతోపాటు ఓ లడ్డూ పిల్లలకూ పెట్టండి. మీరూ తినండి.

ఆరోగ్య సిరి.. ఉసిరి. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్‌, ఔషధ సమ్మేళనాలు మెండు. విటమిన్‌ సి తోపాటు ఐరన్‌, క్యాల్షియం, పీచు కూడా తగినంత మోతాదులో ఉంటాయి. దీన్ని ఉదయంపూట తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు జీర్ణవ్యవస్థా ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్‌, స్కిన్‌ హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఉసిరి చట్నీ, జ్యూస్‌, మురబ్బా... ఇలా ఏ రూపంలోనైనా తీసుకోండి.

నెయ్యి పదార్థాలు... దేశవాళీ నెయ్యిలో విటమిన్‌ ఎ, ఇ, కె, ఒమేగా-3, 9 ఫ్యాటీ ఆమ్లాలు మెండు. కాబట్టి దీన్ని ఈ కాలం తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ కనీసం ఓ చెంచా నెయ్యిని తింటే జీవక్రియలు మెరుగ్గా సాగుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. తల తిరగడం, బలహీనత లాంటి సమస్యలకు చెక్‌ పెట్టి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. సీజనల్‌ వ్యాధుల నుంచి కాపాడుతుంది.

డ్రైఫ్రూట్స్‌... రోజూ ఉదయం ఓ గుప్పెడు డ్రైఫ్రూట్స్‌ను తినండి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పొట్టలోని పీహెచ్‌ స్థాయులను బ్యాలెన్స్‌ చేస్తాయి. దాంతో శరీరానికి కావాల్సిన వేడిమి అందుతుంది. అయితే వీటిని నిర్ణీత మొత్తంలోనే తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్