Published : 22/11/2021 00:28 IST

చలికాలంలో తేనె వైద్యం!

చలికాలంతో పాటే... జలుబు, దగ్గు కూడా వెంటవస్తాయి. వీటి నుంచి ఉపశమనానికి తేనె మంచి పరిష్కారం... 

* చెంచా తేనెకి... చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

* ఒక కప్పు హెర్బల్‌టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్‌ జరుగుతుంది.

* బరువు తగ్గాలనుకునేవారు చెంచా తేనెకి... అరచెంచా దాల్చినచెక్క పొడి కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పంటిసమస్యల నుంచీ ఉపశమనం కలుగుతుంది.

* రెండు చెంచాల యాపిల్‌సిడార్‌ వెనిగర్‌కి ఒక చెంచా చొప్పున తేనె కలిపి తాగితే... సైనస్‌ అదుపులో ఉంటుందట.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని