ఇంట్లోనే.. యోగర్ట్‌

బరువు తగ్గడం, ఆరోగ్య, చర్మ సంరక్షణ అంశాల్లో అవగాహన పెరుగుతోంది. ఇలాంటివారికి ఉపయోగపడేదే ఈ ఎలక్ట్రిక్‌ యోగర్ట్‌ మేకర్‌. పోషకాలతో కూడి, పలురకాల అనారోగ్యాలను దరిచేరకుండా చేసే

Published : 22 Nov 2021 00:28 IST

బరువు తగ్గడం, ఆరోగ్య, చర్మ సంరక్షణ అంశాల్లో అవగాహన పెరుగుతోంది. ఇలాంటివారికి ఉపయోగపడేదే ఈ ఎలక్ట్రిక్‌ యోగర్ట్‌ మేకర్‌. పోషకాలతో కూడి, పలురకాల అనారోగ్యాలను దరిచేరకుండా చేసే పెరుగును అందిస్తుందిది. వంటింట్లో తేలిగ్గా ఇమిడిపోయే ఈ మెషిన్‌లో ఏడు సమాన కప్పులుంటాయి. పాలను మరిగించి వీటిలో నింపి, వాటిల్లో అరచెంచా పెరుగు కలిపి పైమూత బిగించి స్విచ్‌ వేస్తే చాలు. రెండు గంటల్లో చిక్కనైన పెరుగు సిద్ధమవుతుంది. వీటిలో తాజా పండ్ల ముక్కలు, డార్క్‌ చాక్లొట్‌, స్ట్రాబెర్రీ సిరప్‌, క్రష్డ్‌ కుకీస్‌ వంటివి వేసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీస్తే చాలు. రుచికరమైన యోగర్ట్‌ సిద్ధం. కప్పులను సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్