తీపికి దూరంగా...

ఏడిస్తే చాక్లెట్‌.. పాలు తాగాలంటే చక్కెర.. ప్రతి ఇంట్లోనూ మామూలే. ఇదంత మంచి అలవాటు కాదంటున్నారు వైద్యనిపుణులు. లేదంటే వారిలో మధుమేహంతోపాటు అధికబరువు వంటి దీర్ఘకాలిక

Published : 22 Nov 2021 00:28 IST

ఏడిస్తే చాక్లెట్‌.. పాలు తాగాలంటే చక్కెర.. ప్రతి ఇంట్లోనూ మామూలే. ఇదంత మంచి అలవాటు కాదంటున్నారు వైద్యనిపుణులు. లేదంటే వారిలో మధుమేహంతోపాటు అధికబరువు వంటి దీర్ఘకాలిక సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉందంటున్నారు.

అనారోగ్యాలు రాకముందే పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. అమ్మానాన్నలు నిత్యం తీపి పదార్థాలను తీసుకుంటే చిన్నవాళ్లూ అనుసరిస్తారు. కాబట్టి, పెద్దవాళ్లు గమనించుకోవాలి. ఇంట్లో వండిన వాటినే తీసుకునేలా చిన్నారులకు అలవాటు చేయాలి. తాజా ఆహారాన్నే అందించాలి.

* సమయపాలన.. ఉదయం నుంచి రాత్రి వరకు అల్పాహారం, మధ్యాహ్నభోజనం వంటివాటికి నిర్ణీతసమయాన్ని కేటాయించాలి. దీంతో రక్తంలో చక్కెరస్థాయులు హెచ్చుతగ్గుల్లేకుండా స్థిరంగా ఉంటాయి. .

* పీచు.. రోజువారీ ఆహారంలో దీనికీ ప్రాధాన్యముండాలి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచి, మలబద్ధకం లేకుండా చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటకు పంపుతుంది. దీంతో రక్తంలో చక్కెరస్థాయులు పెరగకుండా ఉంటాయి. భవిష్యత్తులో మధుమేహం వంటి సమస్యలు దరిచేరవు.

* కార్బొహైడ్రేట్స్‌..  చిరుధాన్యాలు, పొట్టు తక్కువగా తీసిన బియ్యం, తాజా కూరగాయలు ఆహారంలో ఉండేలా చూడాలి. అలాగే ఆవు నెయ్యి, కొబ్బరి, విత్తనాలు, నట్స్‌ వంటివి ఇవ్వాలి.

* వీటికి దూరం... చక్కెరతోపాటు మైదా, స్వీట్లు, చాక్లొట్లు, శీతలపానీయాలు, షుగర్‌ కోటెడ్‌ బిస్కట్లు, బర్గర్లు, పిజ్జా, నూనెతో చేసిన స్నాక్స్‌ వంటివాటికి చిన్నారులను వీలైనంత దూరంగా ఉంచాలి.
* వ్యాయామం.. రోజూ కొంత సమయాన్ని కేటాయించేలా చూడాలి. పరుగు, స్కిప్పింగ్‌తోపాటు నృత్యం వంటివి ప్రోత్సహిస్తే కండరాలు బలోపేతమవుతాయి. చక్కెరస్థాయులూ పెరగవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్