ఆఫీసులోనూ ఎక్సర్‌సైజ్‌!

తిరిగే వాటి కంటే నీడ పట్టున చేసే ఉద్యోగాలకే ఎక్కువ మంది అమ్మాయిల ఓటు. కానీ.. కొద్ది కాలం గడవగానే... అబ్బా పొట్ట పెరుగుతోంది, మెడ, నడుము, భుజాల నొప్పులు అనేస్తారు.

Updated : 23 Nov 2021 06:27 IST

తిరిగే వాటి కంటే నీడ పట్టున చేసే ఉద్యోగాలకే ఎక్కువ మంది అమ్మాయిల ఓటు. కానీ.. కొద్ది కాలం గడవగానే... అబ్బా పొట్ట పెరుగుతోంది, మెడ, నడుము, భుజాల నొప్పులు అనేస్తారు. దీనికి తోడు కరోనా తర్వాత పని గంటలు పెరిగి, సీటుకు అతుక్కు పోతున్న వాళ్లే ఎక్కువ. దీనికి ‘డెస్కర్‌సైజ్‌’ మంచి పరిష్కార మంటున్నారు నిపుణులు.

డెస్కర్‌సైజ్‌.. అంటే ఆఫీసులో కూర్చొనే చేసే వ్యాయామాలన్న మాట. అమ్మో ఆఫీసులో ఎక్సర్‌సైజ్‌ ఏంటని కంగారు పడనక్కర్లేదు. చాలా చిన్నవీ, సులువుగా చేసేవే ఇవి.

* నడుము నొప్పిగా అనిపిస్తోందంటే.. కుర్చీలో ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చున్నారని అర్థం. అప్పుడు ఇరుపక్కలా స్ట్రెచ్‌ చేయండి. ఉపశమనం ఉంటుంది.

* కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలను నేలకు ఆన్చి, చేతులను మోకాళ్లపై ఉంచాలి. ఇప్పుడు భుజాలను గుండ్రంగా తిప్పాలి. తర్వాత గడ్డం ఛాతికి ఆనేలా వంగి కొద్దిసేపు అలా ఉండాలి. వీటిని ఒకదాని తర్వాత మారుస్తూ 4-5సార్లు చేస్తే మెడ, భుజాల నొప్పులుండవు.

* కుర్చీలో వెనక్కి వాలి కూర్చొని తల వెనుక రెండు చేతుల్నీ ఉంచి, వెనక్కి స్ట్రెచ్‌ చేయండి. 10 వరకూ చేయొచ్చు. ఇక్కడ మెడ, భుజాలు, నడుము మూడింటికీ వ్యాయామమవుతుంది. పొట్ట దగ్గరి కొవ్వూ కరుగుతుంది.

దీంతోపాటు ప్రతి గంటకోసారి కుర్చీలోంచి లేచి నాలుగు అడుగులు వేస్తుండటమూ ప్రధానమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్