పొత్తికడుపు నాజూగ్గా...

పుషప్స్‌.. అబ్బాయిల కోసమే అని చాలామంది అమ్మాయిల భావన. కానీ ఫిట్‌నెస్‌ కోరుకునే అమ్మాయిలకూ ఇది మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు

Updated : 25 Nov 2021 05:43 IST

పుషప్స్‌.. అబ్బాయిల కోసమే అని చాలామంది అమ్మాయిల భావన. కానీ ఫిట్‌నెస్‌ కోరుకునే అమ్మాయిలకూ ఇది మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. ఛాతీ, భుజాలు, కాళ్ల కండరాలతోపాటు నడుమునీ దృఢంగా చేస్తుందట. కాబట్టి, వారంలో కనీసం మూడు, నాలుగు రోజులు ఇవి చేయడం మంచిదని సూచిస్తున్నారు. దీని వల్ల ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.

ముందు చిన్నచిన్న స్ట్రెచెస్‌తో శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. నేలపై లేదా యోగా మ్యాట్‌ దేనిమీదైనా పుషప్స్‌ చేయొచ్చు. నేలమీద బోర్లా పడుకోవాలి. రెండు చేతులను దూరంగా, అరచేతులు భూమికి ఆనేలా ఉంచాలి. అలాగే పాదాలను మునివేళ్లపై ఉంచి శరీరాన్ని అంతటినీ నెమ్మదిగా పైకిలేపి తిరిగి యథాస్థానానికి తేవాలి. ఛాతీ నుంచి మోకాళ్లవరకు భూమికి నెమ్మదిగా తాకేలా చేయాలి. తిరిగి వెంటనే శరీరాన్ని అరచేతులపై బ్యాలెన్స్‌ చేసుకుంటూ పైకి లేపాలి. ఈ వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు అయిదు నుంచి పదిసార్లు చేస్తే చాలు. అలా క్రమేపీ పెంచుకుంటే పొత్తికడుపు వద్ద కొవ్వు తగ్గడమే కాకుండా కండరాలు, కాళ్లు దృఢంగా మారతాయి. నడుం పైభాగంలోని కండరాలు, భుజాలు, ఛాతీ కండరాలు బలోపేతమవుతాయి. దీంతో కండరాల అలసట, నొప్పి త్వరగా దరికి చేరవు. కొద్దిపాటి శ్రమకే అలసిపోయే అమ్మాయిలకు శక్తిని పెంచుకోవడానికి ఈ వ్యాయామం సాయపడుతుంది. శరీరభాగాల్లో అధిక కొవ్వును పేరుకోకుండానూ చేస్తుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్