ఇవీ తీపిని పంచుతాయి
close
Published : 28/11/2021 01:29 IST

ఇవీ తీపిని పంచుతాయి!

తీపి పదార్థాలకు దూరంగా ఉండమంటే పిల్లలు వినరు. ఇంట్లో పెద్ద వాళ్లకీ చక్కెరకు, మిఠాయిలకు దూరంగా ఉండమని పదే పదే చెప్పలేం. దీనికేంటి పరిష్కారం అంటే... ప్రత్యామ్నాయాలివిగో!

* ఎరిథ్రిటాల్‌.. దీన్ని పండ్ల నుంచి తయారుచేస్తారు. పౌడర్‌ రూపంలో దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ భయముండదు. ప్రత్యేక వంటకాల్లో వేసే కొకోవా పౌడర్‌, వెనిల్లా ఎస్సెన్స్‌లా ఈ పౌడర్‌నూ వేసుకోవచ్చు.

* బెల్లం.. తీపి రుచినే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది. కెలోరీలూ తక్కువే. ఆకుల నుంచి తయారయ్యే స్టీవియా మామూలు చక్కెరకన్నా తీయగా ఉంటుంది. దీన్ని టీ, కాఫీ, నిమ్మరసం వంటివాటిల్లో కలుపుకుంటే రుచినీ పెంచుతుంది. తాటి బెల్లం కూడా మంచిది. శరీరంలోని అధికనీటిని తగ్గించి, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

* మేపిల్‌ సిరప్‌.. పాన్‌కేక్స్‌, వాఫెల్స్‌ తయారీలో మేపిల్‌ సిరప్‌ చక్కని ఎంపిక. మేపిల్‌ చెట్టు నుంచి తయారయ్యే ఈ సిరప్‌ ఆరోగ్యానికీ మంచిది.

* డేట్స్‌ సిరప్‌.. పోషకాలెక్కువగా ఉండే ఎండు ఖర్జూర నుంచి తీసిన ఇది రుచితోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. దీంట్లోని ఐరన్‌.. మహిళల్లో రక్తహీనతను దూరం చేస్తుంది. స్వీట్ల తయారీలోనూ డేట్స్‌ సిరప్‌ను వాడొచ్చు. కొబ్బరి నుంచి చేసే షుగర్‌నూ స్వీట్ల తయారీలో వాడొచ్చు. పోషకాలూ ఎక్కువే.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని