చిన్న పొరపాట్లతో.. పెద్ద అనారోగ్యం

ఉరుకుల పరుగుల జీవితంలో పడి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వీటితో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం, మెదడు కణజాలం దెబ్బతినడం, అల్జీమర్‌ లాంటి సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. కొన్ని...

Published : 29 Nov 2021 01:27 IST

ఉరుకుల పరుగుల జీవితంలో పడి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వీటితో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం, మెదడు కణజాలం దెబ్బతినడం, అల్జీమర్‌ లాంటి సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. కొన్ని అలవాట్ల వల్ల మెదడు, శరీరం రెండూ దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి ఆ అలవాట్లు ఏంటో, వాటిని ఎలా నియంత్రించుకోవాలో చూద్దామా.

అల్పాహారం: మనలో చాలామంది ఉదయం అల్పాహారం తినరు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెరస్థాయులు పడిపోతాయి. దాంతో మెదడుకు కావాల్సిన పోషకాలు అందవు. ఫలితంగా మెదడు అభివృద్ధి, అది చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

తీపి: కొందరు తీపి పదార్థాలు అతిగా తింటుంటారు. అధికంగా తీపి తింటే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఊబకాయం, మధుమేహం, చర్మసంబంధ, ఇతర అనారోగ్య  సమస్యలు చుట్టుముడతాయి.

శారీరక శ్రమ: ఒకే చోట ఎక్కువ గంటలు కూర్చొని ఉండటం వల్ల మెదడు స్తబ్దుగా మారిపోతుంది. ఒత్తిడి పెరుగుతుంది. వీటిని ఆపాలంటే రోజూ తప్పనిసరిగా ఓ అరగంట యోగా లేదా వ్యాయామం చేయాలి. దీంతో మెదడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు కణాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది చక్కగా పని చేస్తుంది.

నిద్రలేమి: రాత్రి నిద్ర పోయాక మన శరీరం మరమ్మతులు చేసుకుంటుందని నిపుణులు చెబుతారు. దీంతో తర్వాత రోజు మెదడు బాగా పని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. నిద్రలేమితో వ్యక్తులు అలసిపోతారు. బలహీనపడతారు. రోజంతా నిరుత్సాహంగా ఉంటారు. చేసే పనిపై శ్రద్ధ పెట్టలేరు. అంతేకాదు నిద్రలేమి వల్ల మెదడు, గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి. కాబట్టి రోజుకు ఏడెనిమిది గంటలు నిద్ర పోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్