ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా

నా దృష్టిలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన 3 విషయాలు..సంకేతాలను గ్రహించండి: అలసట, ఆయాసం, విసుగు వంటివి తరచూ కలుగుతోంటే పని ఎక్కువైందనో సాధారణమేలే అనో అనుకోవద్దు.

Updated : 01 Dec 2021 05:51 IST

నా దృష్టిలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన 3 విషయాలు..

సంకేతాలను గ్రహించండి: అలసట, ఆయాసం, విసుగు వంటివి తరచూ కలుగుతోంటే పని ఎక్కువైందనో సాధారణమేలే అనో అనుకోవద్దు. అవి శరీరం చేస్తున్న హెచ్చరికలు. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయద్దు. వెంటనే వైద్యసలహా పొందండి.

చురుకుగా ఉండండి: మీ గైనకాలజిస్ట్‌ని క్రమం తప్పకుండా సందర్శించండి. వారు సూచించే వైద్య పరీక్షలను తప్పకుండా చేయించుకోవాలి. ఓ వయసు తరువాత మనకు వచ్చే బోలు ఎముకల వ్యాధి, రుతు విరతి వంటి వాటి విషయంలో ముందస్తు అంచనా వేసుకోవాలి.

ఆరోగ్యమే ప్రధానం: మీ ఆరోగ్యాన్ని బ్యాక్‌ బర్నర్‌కు నెట్టడం సులభం. అలా చేయవద్దు. కూతురు, సోదరి, భార్య, తల్లి, ప్రొఫెషనల్‌ - ఇలా జీవితంలో మీరే పాత్రను సమర్థంగా పోషించాలన్నా అది ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యమన్నది గుర్తుంచుకోండి.

- నమితా థాపర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌,ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్