ఫిట్‌గా ఉండాలంటే.. పాటించాలివీ
close
Published : 02/12/2021 01:25 IST

ఫిట్‌గా ఉండాలంటే.. పాటించాలివీ!

కొవిడ్‌ తర్వాత వ్యాయామానికి దూరమైన అమ్మాయిలే ఎక్కువ. ఉద్యోగినులైతే ఇంటి దగ్గర్నుంచే పని పరిపాటైంది. దీంతో ఎక్కువ సమయం కుర్చీల్లోనే గడిచి పోతోంది. కాస్త ఖాళీ దొరికినా ఫోన్‌కో, టీవీకో అతుక్కు పోతున్నారట. ఇది ప్రమాదమంటున్నారు నిపుణులు. వీరికి ఆహారపరంగా కొన్ని సూచనలిస్తున్నారిలా..

ధ్యాహ్న భోజనం తర్వాత తీపి తినడం చాలా మందికి అలవాటు. ఒత్తిడితోనూ స్వీట్లు, చాక్లెట్‌లను లాగించేస్తున్నారట. వీటిలోని ప్రాసెస్డ్‌ షుగర్‌ రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ప్రమాదముంది. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది. అంతేకాదు అవయవాల వాపు, శరీరంలో అదనపు నీరు చేరడం, కీళ్ల నొప్పులు, అధిక బరువు సమస్యలు మొదలవుతాయి. వీటితోపాటు పలు అనారోగ్యాలూ దరి చేరతాయి. కాబట్టి, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.

* ఆహారంలో.. రాత్రి భోజనం నుంచి ఉదయం టిఫిన్‌కి మధ్య దాదాపు 10 గంటల వ్యవధి ఉంటుంది. కాబట్టి అల్పాహారంగా పీచు ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే శరీరానికి తగినంత శక్తి అంది రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. మధ్యాహ్న భోజనంలో పోషకాలు, ఖనిజ లవణాలు నిండిన కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. సాయంకాలాల్లో స్నాక్స్‌కు బదులుగా తాజా పండ్లు తీసుకోవాలి. నూనె, మైదాతో చేసే వాటికి దూరంగా ఉండాలి.

* మంచినీళ్లతో.. రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని శరీరానికి అందించాలి. తాజా పండ్ల రసాలనూ తీసుకోవచ్చు. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లి, పోతాయి. త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే లేవడం వంటి వాటితో పాటు కొద్దిసేపు వ్యాయామం చేయండి. వీలు లేదనో, సమయం కుదరట్లేదనో అనిపిస్తే కనీసం నడక, యోగా వంటివి ప్రయత్నించండి. అప్పుడే శరీరం, మెదడు రెండూ ఉత్సాహంగా పనిచేస్తాయి. ఫిట్‌గానూ ఉండగలుగుతారు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని