బ్యూటీ ప్రొడక్ట్‌లతో జాగ్రత్త

చర్మాన్ని మెరిపిస్తాయంటూ మార్కెట్‌లో విక్రయిస్తున్న పలురకాల విదేశీ సౌందర్య ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన మెర్క్యురీ ఉన్నట్లు ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. దిల్లీకి చెందిన ఎన్విరాన్‌మెంట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజాగా...

Published : 02 Dec 2021 01:25 IST

ర్మాన్ని మెరిపిస్తాయంటూ మార్కెట్‌లో విక్రయిస్తున్న పలురకాల విదేశీ సౌందర్య ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన మెర్క్యురీ ఉన్నట్లు ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. దిల్లీకి చెందిన ఎన్విరాన్‌మెంట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ అంశం వెలుగుచూసింది. వీటిల్లో న్యూరోటాక్సిన్‌ అయిన మెర్క్యురీ ఎక్కువశాతంలో ఉందట. అత్యంత ప్రమాదకరమైన ఈ రసాయనం వల్ల చర్మం అందంగా మారడం కన్నా, జరిగే చేటే ఎక్కువ. ఈ పరిశోధన కోసం ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళల్లో ఎక్కువగా వాడుతున్న 15 రకాల స్కిన్‌ వైట్‌నింగ్‌ క్రీములను సేకరించారు. వీటిని దిల్లీ శ్రీరామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌కు తరలించి పరిశోధనలు చేపట్టారు. వాటిలో ఆరు సంస్థలకు చెందినవాటిల్లో అత్యధిక స్థాయిలో మెర్క్యురీ ఉన్నట్లు తేలింది. ఈ ఆరు రకాల ఉత్పత్తులూ విదేశీ సంస్థకు చెందినవే. దేశీయంగా చేసిన మిగతా వాటిల్లోనూ కొంత మొత్తంలో ఈ రసాయనం ఉంది. ఇది చర్మానికే కాకుండా, పలు రకాల అనారోగ్యాలకూ కారణమవుతుంది అంటున్నారు వైద్యనిపుణులు. ఇది నరాల వ్యవస్థ, జీర్ణవ్యవస్థలను దెబ్బతీయడంతోపాటు వ్యాధినిరోధక శక్తినీ తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి, ఉత్పత్తులను ఎంచుకునేముందు వాటిలో ఉపయోగించే పదార్థాలను సరిచూసుకోమని సలహానిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్