వ్యాయామానికిముందూ... తర్వాత
close
Published : 07/12/2021 00:50 IST

వ్యాయామానికిముందూ... తర్వాత!

క్రమం తప్పక చేసే వ్యాయామాలతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండగలుగుతాం. దీనికి సరైన ఆహారమూ తోడైతేనే సత్ఫలితాలు సాధ్యం. కాబట్టి...

వ్యాయామానికి ముందు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. అరటిపండు, పెరుగు లాంటివి తినాలి. ఎండు ఫలాలను జోడించుకుంటే ఇన్సులిన్‌ స్థాయులు సమతుల్యం అవుతాయి. వీటితోపాటు యాపిల్‌, పాలు, బాదం, వాల్‌నట్స్‌, స్మూథీలు, ఓట్స్‌, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ, తేనె కలిపి నీళ్లు, ఫ్లేవర్డ్‌ యోగర్ట్స్‌, అవిసెగింజలు, చియా సీడ్స్‌ వంటి వాటినీ జోడించుకోవచ్చు.

వర్కవుట్లు కాగానే గుడ్డును తింటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లతోపాటు కండర సామర్థ్యానికి సరిపడా పోషకాలు అందుతాయి. చేపలు ఇన్సులిన్‌ను బ్యాలెన్స్‌ చేయడమే కాకుండా మజిల్‌ ఇన్‌ఫ్లమేషన్‌నూ తగ్గిస్తాయి. ఎక్సర్‌సైజ్‌ల తర్వాత రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు పడిపోకుండా చిలగడ దుంప లాంటివి సహకరిస్తాయి. ట్యూనా రకం చేపలు ఎక్కువ మోతాదులో ప్రొటీన్లను, మేలైన పోషకాలను అందిస్తాయి. వీటితోపాటు ఆమ్లెట్‌, కాటేజ్‌ చీజ్‌, పీనట్‌ బటర్‌ టోస్ట్‌, చిరుధాన్యాలు, పండ్లు, ఎండుఫలాలు వేసిన పాలు, పెరుగుతోపాటు పీచు, ప్రొటీన్‌, పిండి పదార్థాలు మెండుగా ఉండే బాదం, కిస్‌మిస్‌ గింజలు గుప్పెడు తిన్నా మేలే.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని