వార్మప్‌ చేస్తున్నారా!

వ్యాయామానికి ముందు వార్మప్స్‌ చేస్తున్నారా? దీనికే చాలా కష్టంగా సమయం కేటాయించుకుంటున్నాం. ఇక వీటినేం చేస్తామంటారా? ఎక్సర్‌సైజ్‌తో పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వార్మప్‌ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

Published : 08 Dec 2021 00:40 IST

వ్యాయామానికి ముందు వార్మప్స్‌ చేస్తున్నారా? దీనికే చాలా కష్టంగా సమయం కేటాయించుకుంటున్నాం. ఇక వీటినేం చేస్తామంటారా? ఎక్సర్‌సైజ్‌తో పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వార్మప్‌ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

* దీనివల్ల శరీరంలోని కణజాలాలన్నింటికీ ఆక్సిజన్‌ అందుతుంది. తద్వారా రక్తసరఫరా వేగం వృద్ధి చెందడంతోపాటు కండర సామర్థ్యమూ పెరుగుతుంది. వ్యాయామం చేసేటప్పుడు గాయలవడం తగ్గుతుంది.
* గుండె స్పందన, శ్వాసక్రియా రేటు పెరుగుతాయి. వీటితోపాటు ఆందోళన తగ్గి.. ఏకాగ్రత పెరుగుతుంది.
* వార్మప్‌ శరీరాన్ని వ్యాయామానికి అనువుగా సిద్ధం చేస్తుంది. దీంతో బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
* వీటిని చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది. రక్తం వేగంగా కండరాలకు అందుతుంది.
* నడక, ఆర్మ్‌ సర్కిల్‌, స్పిన్‌ జంప్‌, ఆర్మ్‌ స్ట్రెచ్‌, కరాటే కిక్‌, టో సర్కిల్‌, బైసెప్‌ కర్ట్‌, క్రిస్‌క్రాస్‌ జంప్‌, హూప్‌, జంపింగ్‌్ జాక్‌, టో టచ్‌... వీటన్నింటినీ వార్మప్స్‌గా చెప్పొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్